Share News

నగర సుందరీకరణకు రూ.78కోట్లు మంజూరు

ABN , Publish Date - May 17 , 2025 | 10:59 PM

మంచిర్యాల నగరపాలక సంస్థ వ్యాపార ప్రాంతాల రహదారులను సుందరీకరణ చేసేందుకు 78కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు.

నగర సుందరీకరణకు రూ.78కోట్లు మంజూరు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు

ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు

మంచిర్యాలక్రైం, మే17 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నగరపాలక సంస్థ వ్యాపార ప్రాంతాల రహదారులను సుందరీకరణ చేసేందుకు 78కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. శనివారం వ్యాపారస్తులతో కలిసి మార్కెట్‌ స మీపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ మార్కెట్‌, శ్రీనివాస్‌టాకీస్‌, వెంకటేశ్వర టాకీస్‌, కాలేజీ, శ్రీవిశ్వనాథ ఆలయం ప్రాంతాలలో సుందరీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. రహదారుల విస్తరణ, భూగర్భ మురికికాలువలు, ఫు ట్‌పాత్‌ నిర్మాణ పనులను జూన్‌లో ప్రారంభిస్తామన్నారు. ఆలయం దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాల ను తొలగిస్తామన్నారు. తన ఇంటి ముందు నుంచి టూటౌన్‌ అనుసం దానంగా ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం రెండు నెలల్లో చేపడుతామ న్నారు. 2027 సంవత్సరానికి సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పేద వారికి ఆధునిక వైద్యసేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

వారంలో ఐటీ పార్కు...

వేంపల్లిలో ఇండస్ర్టిల్‌ పార్కు ఏర్పాట్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని లే అవుట్‌ భూమి కేటాయింపు ఎలా అనే అంశంపై నిర్ణయం తీసుకొని సకల సౌకర్యాలతో వ్యాపారస్తులకు భూమి విక్ర యిస్తామన్నారు. ఐటీ పార్కులో తాను కూడ కోడి గుడ్ల ఎగుమతి, మామిడి ఇతర పండ్లు కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ముల్క ల్ల నుంచి గోదావరినదిపై వంతెన నిర్మాణం ప్రక్రియ జరుగుతుందని ఐటీ పార్కు అనుసంధానంగా బసంత్‌నగర్‌ వద్ద విమానాశ్రయం ఏ ర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందన్నారు. 45కోట్లతో ప్రభుత్వ పాఠశా లల్లో సౌకర్యాలు మెరుగుపరచడం వల్ల విద్యార్థుల సంఖ్య 4800 మం దికి పెరిగిందన్నారు. రేవంత్‌ రెడ్డికి తన నిర్ణయం నచ్చడంతో రా ష్ట్రం లోని పాఠశాలల సౌకర్యాల కల్పనకు పూనుకున్నారన్నారు. అవినీతి పై చర్చకు ప్రతిపక్షం సిద్ధమా అని ప్రశ్నించారు. చర్చకు ఎవరు వ చ్చినా లెక్కలతో సహా వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌లాగా జీవోలు తీసుకొచ్చి క్షీరాభిషేకం చే యలేదని పక్కాగా నిధులు తీసుకొస్తున్నానని అన్నారు. స్పోర్ట్స్‌ స్టేడి యం నిర్మించాల్సి ఉందని దాన్ని కూడ ఎన్నికల్లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 6వేల మందికి రాజీవ్‌ యువశక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ నాయకులతో పాటు వ్యాపా రస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 10:59 PM