Share News

రైతుల ఖాతాల్లోకి రూ.372 కోట్లు

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:43 PM

రైతు భరోసా కింద ఇప్పటి వరకు జిల్లాలో 2,89,15 మంది రైతుల ఖాతాల్లో రూ.372.215 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అ యినట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు.

రైతుల ఖాతాల్లోకి రూ.372 కోట్లు

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : రైతు భరోసా కింద ఇప్పటి వరకు జిల్లాలో 2,89,15 మంది రైతుల ఖాతాల్లో రూ.372.215 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అ యినట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారం భించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీ సుకొచ్చిన రైతు భరోసా పథకం, రైతుల పంట పెట్టుబడులకు భరోసా ఇచ్చేలా వ్యవసాయ రంగాన్ని స్థిరీకరిస్తోందని కలెక్టర్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది రైతులకు ఈ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు.

Updated Date - Jun 22 , 2025 | 11:43 PM