మునిసిపాలిటీల అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:40 PM
కల్వకుర్తి ని యోజకవర్గంలోని మునిసి పాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.30కోట్లు మంజూరు చేసిం దని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి ని యోజకవర్గంలోని మునిసి పాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.30కోట్లు మంజూరు చేసిం దని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. కల్వకుర్తి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చల్లని చూపు ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నాగర్‌క ర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, విద్యా క మిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్‌లతో క లిసి ఎమ్మెల్యే విలేకర్ల సమావేశంలో మాట్లా డారు. కల్వకుర్తి మునిసిపాలిటీలో పది పనుల కు రూ.15కోట్లు, ఆమనగల్ మునిసిపల్ అభివృ ద్ధికి రూ.15కోట్లు సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేశారని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలే కే ప్రతిపక్ష పార్టీల నాయకులు పసలేని ఆరోప ణలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. అ డ్డగోలుగా మాట్లాడకూడదని ఎమ్మెల్యే సూచిం చారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజే ష్‌రెడ్డి, విద్యాకమిషన్ సభ్యుడు చారకొండ వెంక టేశ్ మాట్లాడారు. సమావేశంలో టీశాట్ సీఈ వో వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ క మిటీ సభ్యుడు జిల్లెల రాములు, కల్వకుర్తి ము నిసిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పసుల రమాకాంత్‌రెడ్డి, మసూ ద్, కొండల్, నాయకులు ఏజాస్, చంద్రకాంత్ రెడ్డి, నాయకులు ఉన్నారు.