Ponnam Prabhakar: బస్‌స్టేషన్ల నిర్మాణానికి 108 కోట్లు
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:55 AM
ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎ్‌సఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త డిపోల నిర్మాణం, బస్ ేస్టషన్ల ఆధునికీకరణ కోసం..
పండగ రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలి: పొన్నం
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎ్‌సఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త డిపోల నిర్మాణం, బస్ ేస్టషన్ల ఆధునికీకరణ కోసం రూ.108.02 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. అందులో భాగంగా 30 బస్‌స్టేషన్ల ఆధునికీకరణతో పాటు వాటిలో షాపింగ్ కాంప్లెక్సులను కూడా అధికారులు నిర్మించనున్నారు. సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం అనే మూడు విధానాలతో ఆర్టీసీ ముందుకు వెళుతోందని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయాలని సూచించారు. దసరా సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సులను నడిపేందుకు టీజీఎ్‌సఆర్టీసీ కార్యాచరణ రూపొందించిందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు.