Share News

Minister Seethakka: పంచాయతీ కార్యదర్శులకు రూ.104 కోట్ల బకాయిల విడుదల

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:18 AM

రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు రావాల్సిన రూ.104కోట్ల పెండింగ్‌ బకాయిలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు...

Minister Seethakka: పంచాయతీ కార్యదర్శులకు రూ.104 కోట్ల  బకాయిల విడుదల

  • మంత్రి సీతక్క వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు రావాల్సిన రూ.104కోట్ల పెండింగ్‌ బకాయిలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య చర్యలు, నీటి సరఫరా మోటార్ల మరమ్మతులకు, ఇతర పనులకు సొంతంగా ఖర్చు చేసినట్లు పంచాయతీ కార్యదర్శులు ఇటీవలే మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు. రూ.104కోట్ల విడుదలతో పంచాయతీ కార్యదర్శుల పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ అయ్యాయని సీతక్క తెలిపారు.

ఈరోజు 300 కోట్లయినా విడుదల చేస్తాం

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిల్లో మంగళవారం రూ.300 కోట్లయినా విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు భట్టిని కలిశారు. దీనిపై స్పందించిన ఆయన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. అంతకుముందు సంఘం ప్రతినిధులు మంత్రులు శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను కలిశారు.

Updated Date - Sep 30 , 2025 | 05:18 AM