kumaram bheem asifabad- రహదారులకు మరమ్మతులు చేపట్టాలి
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:17 PM
జిల్లాలో ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా రహదారులపై గుంతలు పడిన చోట్ల మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కసాబ్‌వాడి వార్డులో మంగళవారం అంతర్గత రహదారులు, మురికి కాలువలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా రహదారులపై గుంతలు పడిన చోట్ల మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కసాబ్‌వాడి వార్డులో మంగళవారం అంతర్గత రహదారులు, మురికి కాలువలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు, వాహనదా రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని చెప్పారుఉ. ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయాలని, ప్రతి రోజు చెత్తను సేకరించాలని తెలిపారు. అనంతరం గొడవెల్లి వద్ద పెద్దవాగులో నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు. పట్టణంలోని వినా యకులను నిమజ్జనం కోసం ఇక్కడికే తీసుకు వస్తారని, భక్తులకు, వినాయక శోభాయాత్ర వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారి చదును చేయాలని చెప్పారు. నిమ్జన ప్రదేశం వద్ద వాహనాలు తిరిగే విధంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నిరంతరం వెలుతురు ఉండే విధంగా లైట్లు ఏర్పాటు చేయాలని, వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం క్రేన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నిమజ్జనం రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ గజానన్, తదితరులు ఉన్నారు.