Share News

రహదారి భద్రత మనందరి బాధ్యత..

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:08 PM

రహదారి భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని డీసీపీ ఎగ్గెడి భాస్క ర్‌ అన్నారు. సోమవారం హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముల్కల్ల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ రహదారి భద్రతా కమిటీని ఏర్పాటు చేసి, రహ దారి భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.

రహదారి భద్రత మనందరి బాధ్యత..

హాజీపూర్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రహదారి భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని డీసీపీ ఎగ్గెడి భాస్క ర్‌ అన్నారు. సోమవారం హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముల్కల్ల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ రహదారి భద్రతా కమిటీని ఏర్పాటు చేసి, రహ దారి భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో పోలీస్‌ కళా బృందం రోడ్డు భద్రతా నియమాలను పాటల రూపం లో ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం నింపారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ రోడ్డు నియమాలు పాటిస్తేనే సురక్షితంగా ఇళ్లకు చేరు కోవచ్చని అన్నారు. హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరి ధిలో గత మూడు సంవత్సరాల్లో జరిగిన రోడ్డు ప్రమా దాల తీవ్రత, కారణాలను వివరించిన ఆయన, ము ల్కల్ల గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ఏడాది ఐదుగురు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట, గూడెం జం క్షన్‌ వరకు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొ న్నారు. ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరిం చారు. ట్రాక్టర్‌ డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, రోడ్లపై పశువులను వదిలివేయడం వంటి చ ర్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరిం చారు. రహదారులపై పశువులను వదిలితే చట్టపరమై న చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వకూడదని త ల్లిదండ్రులకు సూచించారు. మద్యం సేవించి వేగంగా వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించా రు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ ఆర్‌. ప్రకాష్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్స్పెక్టర్‌ చాడ రంజిత్‌, మంచిర్యాల రూరల్‌ సీఐ ఆకుల అశోక్‌, హాజీపూర్‌ తహసీల్దార్‌ శ్రీని వాస్‌ రావు దేశ్‌పాండే, ఎంపీడీవో సాయి వెంకట్‌ రెడ్డి, స్థానిక ఎస్‌ఐ వై. స్వరూప్‌ రాజ్‌, రెవెన్యూ అధికారులు, పోలీస్‌ సిబ్బంది, రహదారి భద్రతా కమిటీ సభ్యులు, గ్రామ యువత, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 11:08 PM