Share News

పట్టణ అభివృద్ధికే రహదారి విస్తరణ

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:32 PM

రోజు రోజుకూ పెరుగుతున్న పట్టణ జనాభాతో పాటు రవాణా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ని అంబేద్కర్‌ చౌక్‌ నుంచి చెన్నూర్‌ పెద్ద చెరువు(కోటపల్లి బస్టాప్‌) వరకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నట్లు మంత్రి జి. వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

పట్టణ అభివృద్ధికే రహదారి విస్తరణ

ఫమంత్రి వివేక్‌ వెంకటస్వామి

ఫనష్టపోకుండా చూడాలంటూ బాధితుల మొర

చెన్నూర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : రోజు రోజుకూ పెరుగుతున్న పట్టణ జనాభాతో పాటు రవాణా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ని అంబేద్కర్‌ చౌక్‌ నుంచి చెన్నూర్‌ పెద్ద చెరువు(కోటపల్లి బస్టాప్‌) వరకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నట్లు మంత్రి జి. వివేక్‌ వెంకటస్వామి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ అధికా రులు, అంబేద్కర్‌ చౌక్‌ నుంచి రావి చెట్టు వరకు రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. దారి ఇరుకుగా ఉండడంతో అను నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, చెన్నూ రు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ట్రాఫిక్‌ సమస్యతో విసిగిపోతు న్నారని, అందరి అభిప్రాయాల మేరకే రహదారి విస్తరణ పనులు చేపడ తున్నామన్నారు. అందరూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రో డ్డు విస్తరణతో తమ దుకాణాలు, ఇళ్లు కోల్పోతున్నామని, భారీ నష్టం ఏర్ప డి రోడ్డున పడతామని బాధితులు ఆయనకు మొరపెట్టుకున్నారు. నిర్మా ణంలో ఉన్న బైపాస్‌ రహదారి పూర్తిచేసి ఆ దారిలో వాహనాలను మళ్లిస్తే ట్రాఫిక్‌ సమస్యను నివారించవచ్చని బాధితులు మంత్రికి విన్నవించారు. రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 20 ఫీట్ల మేర వెడల్పు చేస్తే ఎక్కువగా న ష్టం వాటిల్లదని అన్నారు. రోడ్డు విస్తరణపై అన్ని ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని, అవి పూర్తయ్యాకే పనులు చేపడతామని మంత్రి వివరిం చారు. ఎన్ని ఫీట్లు వెడల్పు చేస్తామనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. రోడ్డు విస్తరణలో పూర్తిగా భవనాలు కోల్పోయిన వారికి యుద్ధప్రాతిపదిక న షాపింగ్‌ కాంప్లెక్ల్‌ నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణ, ఇళ్లు, షాపుల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 11:33 PM