Share News

kumaram bheem asifabad- రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి

ABN , Publish Date - Sep 09 , 2025 | 10:05 PM

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేం దుకు సంబందితశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌తో కలిసి మంగళ వారం సంబందిత అధికారులతో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు

kumaram bheem asifabad- రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేం దుకు సంబందితశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌తో కలిసి మంగళ వారం సంబందిత అధికారులతో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌, ఆర్‌ఆండ్‌బీ, మున్సిపాలిటీ పరిధిలోని రహదారులు, కల్వర్టులు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని అన్నారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తిం చి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ కాంతి లాల్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 19 ప్రమాదాలు జరిగాయని అన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. సమా వేశంలో పీఆర్‌ఈఈ కృష్ణ, ఆర్‌ఆండ్‌బీ డీఈ రాజశేఖర్‌, డీటీవో రాంచందర్‌, వి ద్యు త్‌శాఖ ఎస్‌ఈ శేషారావు, మున్సిపల్‌ కమిషనర్‌ గజానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక లభ్యతపై నివేదికలు రూపొందించాలి

జిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. జిల్లాలోని నదులు, వాగులు, చెక్‌డ్యాంలు, చెరువులు, ప్రాజెక్టులలో ఉన్న ఇసుక లభ్యతను అంచనా వేయడానికి సంబంధిత శాఖల అధికారులు ఉమ్మడిగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి అంచనాలు రూపొందించి ఈనెల 20లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని తెలిపారు. జైనూరులో సాండ్‌ బజారు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మైనింగ్‌ ఏడీ గంగాధర్‌, ఇరిగేషన్‌ ఈఈ గుణవంత్‌రావు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

మెరుగైన విద్య అందించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న బోజనంలో మెనూ ప్రకారం పౌష్ఠికాహరాన్ని అందించాలన్నారు. విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులను ఇప్పటి నుంచే వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని చెప్పారు. తరగతి గదిలో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ తరగతి గదిలో విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామార్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పరీక్షల సహాయ కమిషనర్‌ ఉదయ్‌బాబు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 10:05 PM