రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాఈ్యత
ABN , Publish Date - May 15 , 2025 | 10:49 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమా లు పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, మే 15 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమా లు పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ భ వన సముదాయ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధి కారి శివ్ ఆశీశ్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాసరావు, హరిక్రిష్ణలతో కలిసి పోలీసు రవాణ, రోడ్లు భవనాలు, పంచా యతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెడ్ క్రాస్ సోసైటీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల ప్రమాదాలు జరుగకుండా చర్య లు చేపట్టాలన్నారు. ఆయా రోడ్లలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి (బ్లాక్ స్పాట్) సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. రహదారులు మరమ్మ తులు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు పెట్టాలన్నారు. ప్రమాదాల నియం త్రణలో భాగంగా విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టి డ్రంకెన్ డ్రైవ్ కార్యక్ర మా లు నిర్వహించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఇతర వాహనా లకు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి వైన్స్, బార్ రెస్టారెంట్ల వద్ద పార్కింగ్ స్థలాలు ఉండే విధంగా చర్యలు చేప ట్టాలన్నారు. మార్కెట్ ఏరియాలో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలన్నారు. అవసరం ఉన్న ప్రాంతాల నుంచి వాహనాల వేగ నియంత్రణ సూచిక బోర్డులు రేడియం, లైటింగ్ ఏర్పాటు చర్యలు చేపట్టాన్నా రు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.