Share News

Congress MLA Kavvampalli Satyanarayana: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:57 AM

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రె్‌స కు తన స్వగ్రామంలో జరిగిన పల్లెపోరులో పరాభవం ఎదురైంది.....

Congress MLA Kavvampalli Satyanarayana: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం

మానకొండూర్‌ డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రె్‌స)కు తన స్వగ్రామంలో జరిగిన పల్లెపోరులో పరాభవం ఎదురైంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి స్వగ్రామం పచ్చునూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పారునంది కేశవ్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌(బీఆర్‌ఎస్‌) స్వగ్రామం జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాంలో కాంగ్రెస్‌ మద్దతు పలికిన అభ్యర్థి నోముల రమ్య సర్పంచ్‌గా గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంజయ్‌ కుమార్‌ కొంతకాలంగా కాంగ్రెస్‌ సర్కారుతో కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు స్వగ్రామం కాసిపేట మండలం ధర్మరావుపేట సర్పంచ్‌గా కాంగ్రెస్‌ మద్దతుదారు జే. రాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - Dec 15 , 2025 | 04:58 AM