జగిత్యాల -మంచిర్యాల హైవేకు రైట్ రైట్...
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:25 PM
జగిత్యా ల-మంచిర్యాల నేషనల్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ప చ్చజెండా ఊపింది. ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావ రణ శాఖల నుంచి అనుమతులు రాగా, తాజాగా రహ దారి నిర్మాణానికి అవరమైన రూ. 2550 కోట్లు కేటా యించింది.
-రూ. 2550 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
-ఇప్పటికే అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు
-నాలుగో ప్యాకేజీ కింద రహదారి విస్తరణ
-జిల్లాలో 35.39 కిలో మీటర్ల మేర బ్రౌన్ ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్
మంచిర్యాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జగిత్యా ల-మంచిర్యాల నేషనల్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ప చ్చజెండా ఊపింది. ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావ రణ శాఖల నుంచి అనుమతులు రాగా, తాజాగా రహ దారి నిర్మాణానికి అవరమైన రూ. 2550 కోట్లు కేటా యించింది. దీంతో ఇంతకాలం సందిగ్ధంలో ఉన్న జా తీయ రహదారి (ఎన్‌హెచ్) -63కు ఎట్టకేలకు గ్రీన్ ల భించగా, త్వరలో కాంట్రాక్టింగ్ పూర్తి చేసుకొని, పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్‌హెచ్-63ను కేంద్రం నాలు గు వరుసలుగా విస్తరిస్తుండగా, గరిష్టంగా మూడేళ్లలో ఈ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ రోడ్డు మ హారాష్ట్రలోని దొండ్ వద్ద మొదలై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా 1,065 కిలో మీటర్లు కొనసాగి ఒడిశాలోని కోరావుట్‌లో ముగుస్తుంది. తెలంగాణలో బోధన్- నిజా మాబాద్-ఆర్మూరు-మెట్‌పల్లి-కోరుట్ల-జగిత్యాల-రాయపట్నం-లక్షెట్టిపేట-మంచిర్యాల-చెన్నూరు మీదుగా సాగు తుంది. లక్షెట్టిపేట మీదుగా సాగుతున్న రహదారి గద్దె రాగడి వద్ద చద్రాపూర్-ఛత్తీస్‌గఢ్ ఎన్‌హెచ్ 363కి అ నుసంధానం కానుంది. ఈ రహదారి ఆర్మూరు- మంచి ర్యాల వరకు రోడ్లు, పట్టణాలు, గ్రామాల మీదుగా కొన సాగుతున్నందున గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మించాలని తొ లుత నిర్ణయించినప్పటికీ, అందుకు భారీగా భూ సేకర ణ జరపాల్సి ఉండటం, భూములు ఇచ్చేందుకు రైతు లు ససేమిరా అనడంతో అలైన్‌మెంట్‌లో స్పల్ప మా ర్పులు చేశారు. ప్రస్తుతం ఊళ్లున్న ప్రాంతాల్లో బైపాస్ లు నిర్మించి, మిగతా పాత రోడ్డును విస్తరించేలా ప్ర ణాళిక రూపొందించారు. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు రోడ్డు 131.8 కిలోమీటర్ల పొడవు ఉండనుండగా, రాయపట్నం నుంచి మంచిర్యాల వరకు 35.39 కి.మీ. మేర నిర్మాణం జరుగనుంది. రహదారి నిర్మాణం నా లుగు విడుతలుగా చేపట్టనుండగా నాలుగవ విడు తలో రాయపట్నం-మంచిర్యాల వరకు సాగనుంది.
రైతుల ఆందోళనతో...
ఎన్‌హెచ్-63 కోసం అధికారులు మూడు దఫాలుగా రూట్ మ్యాప్‌లో మార్పులు చేశారు. మొదటి అలైన్ మెంట్ ప్రకారం కొందరు బడా బాబులకు నష్టం వాటి ళ్లుతండటంతో వారి ఒత్తిడికి తలొగ్గి రెండో రూట్ మ్యా ప్‌ను సిద్ధం చేశారు. అది లక్షెట్టిపేట నుంచి ముల్కల్ల వరకు పూర్తిగా నివాస గృహాల మీదుగా వెళ్తుంది. దీ నివల్ల సామాన్య ప్రజానీకానికి తీరని నష్టం కలిగేలా ఉంది. అష్టకష్టాలు పడి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివే తకు గురవుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు స ర్వే పనులను అడ్డుకోవడం, భూములు ఇచ్చేందుకు ని రాకరిస్తూ పలు రకాల ఆందోళనలు నిర్వహించారు. దీ నికి స్పందించిన ఎన్‌హెచ్ అధికారులు మరో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. కొత్త అలైన్‌మెంట్‌తో జీవనా ధారామైన సాగు భూములను సేకరించేందుకు అధికా రులు చర్యలు చేపట్టారు. ఈ అలైన్‌మెంట్ ప్రకారం లక్షెట్టిపేట మండలం మీదుగా గోదావరి నదికి సమాం తరంగా పంట పొలాలు, చేల మీదుగా రహదారి ని ర్మాణం జరగాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంత రైతులకు చెందిన భూములు పెద్ద ఎత్తున శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గరయ్యాయి. మిగిలిన కొద్ది పాటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మళ్లీ రహదారి నిర్మాణం కోసం తమ భూములు సేకరిస్తుండటంతో వారంతా ఆందోళనబాట పట్టారు. తమకు నష్టం కలిగించే రూట్‌మ్యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎ మ్మెల్యేలు, ఉన్నతాధికారులకు విన్నవించారు. చివరి యత్నంగా హై కోర్టును సైతం ఆశ్రయించారు. హై కో ర్టు మధ్యంతర ఉత్తర్వులతో తాత్కాలికంగా రహదారి నిర్మాణానికి బ్రేకులు పడగా, నూతన అలైన్‌మెంట్ రూ పొందించి, అధికంగా భూ సేకరణ అవసరం లేకుం డానే జస సంచారం అధికంగా ఉన్న చోట బైపాస్ ని ర్మాణాలతోపాటు మిగతా చోట్లా పాత రహదారిని వి స్తరించేందుకు మార్గం సుగమం అయింది.
రహదారి నిర్మాణంలో....
ఎన్‌హెచ్-63 నిర్మాణంలో భాగంగా ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు మొత్తం 131.8 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇందు కోసం అవసర మైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఇప్పటికే సేకరిం చారు. అలాగే పలు నిర్మాణాలు కోల్పోతుండగా, 162 కుటుంబాలు నిర్వాసితులుగా మారనున్నాయి. రహ దారి నిర్మాణంలో భాగంగా 178 కిలోమీటర్ల ప్రభుత్వ భూములు అవసరం అవుతుండగా, 1317 ఎకరాల ప్రై వేటు భూములను సేకరించారు. మరో 38.05 కిలో మీటర్ల అటవీ భూములు సైతం రోడ్డు నిర్మాణంలో భాగం కానున్నాయి. అలాగే మొత్తం 131.8 కిలోమీటర్ల పొడవులో 135 నిర్మాణాలు కూల్చివేతకు గురవుతుం డగా, 162 కుటుంబాలు నిర్వాసితులు కానున్నాయి.
మొదటి అలైన్‌మెంట్ ప్రకారమే నిర్మించాలి..
లగిశెట్టి రాజమౌళి, గుడిపేట
రహదారి నిర్మాణం మొదటి అలైన్‌మెంట్ ప్రకారమే చేపట్టాలి. ఇందులో రాజకీయ, పలుకుబడి, ఇతర ప్ర లోభాలకు అవకాశం ఇవ్వకూడదు. రైతులు భూములు కోల్పోకుండా 2018లో రూపొందించిన అలైన్‌మెంట్ ప్ర కారం నిర్మాణం చేపడితే రైతులు అభ్యంతరం తెలిపే అవకాశం ఉండదు.
జీవనాధారం లేకుండా చేయొద్దు....
రమాదేవి, సూరారం
వ్యవసాయ భూములు సేకరించడం ద్వారా రైతు కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేయొద్దు. మొ దటి అలైన్‌మెంట్ ప్రకారం పెద్దగా ప్రజలకు నష్టం ఏ మీ ఉండదు. బడా బాబులను దృష్టిలో ఉంచుకొని అ ప్పుడు రూట్‌మ్యాప్ మార్చారు. కేంద్ర ప్రభుత్వం ని ధులు మంజూరు చేసినందున మొదటి అలైన్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణం చేపట్టాలి.