రైస్ మిల్లర్లు లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - May 27 , 2025 | 11:17 PM
రైస్ మిల్లర్లు 2024-25కు సంబంధించి సీఎంఆర్ డెలీవరి లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, అధికారులతో కలిసి సీఎంఆర్ డెలీవరి, రబీ దాన్యం వేలం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, మే27(ఆంధ్రజ్యోతి): రైస్ మిల్లర్లు 2024-25కు సంబంధించి సీఎంఆర్ డెలీవరి లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, అధికారులతో కలిసి సీఎంఆర్ డెలీవరి, రబీ దాన్యం వేలం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 ఖరీఫ్ సంబంధిత సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలీవరి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ ఏసీకే లక్ష్యాలను సైతం పూర్తి చేసి రబీకి సంబంధించి ధాన్యం ప్రక్రియను ప్రాంభించాలన్నారు. సకాలంలో ధాన్యం డెలీవరి పూర్తి చేయని పక్షంలో ధాన్యం దెబ్బతింటుందని అన్నారు. ఇందులో వారిగా పెండింగ్‌లో ఉన్న లక్ష్యాల వివరాల ను తెలుసుకొని అధికారులు, రైస్‌మిల్లర్లు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. 2022-23 రబీకి సంబంధించి దాన్యం వేలంలో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమా చేయాలని లేని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బ్రహ్మారావు, డీఎం శ్రీకళ, ఆర్‌ఐ. మురళిక్రిష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.