Share News

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించండి

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:17 PM

నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధా నా న్ని పునరుద్ధరించాలని టీఎస్‌సీపీ ఎస్‌ ఈయూ జిల్లా ప్రధాన కార్య దర్శి లక్ష్మీనరసింహారావు డిమాండ్‌ చేశారు.

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించండి
మాట్లాడుతున్న లక్ష్మీనరసింహారావు

- టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహారావు

కల్వకుర్తి, జూలై 31 (ఆంధ్రజ్యో తి) : నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధా నా న్ని పునరుద్ధరించాలని టీఎస్‌సీపీ ఎస్‌ ఈయూ జిల్లా ప్రధాన కార్య దర్శి లక్ష్మీనరసింహారావు డిమాండ్‌ చేశారు. క ల్వకుర్తి పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో గురు వారం సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమా వేశం జరిగింది. ఈ సమావేశానికి లక్ష్మీనరసిం హారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల ప్రభు త్వ ఉద్యోగులకు నూతన పెన్షన్‌ తీసుకొచ్చి భరో సా లేకుండా చేశారని విమర్శించారు. సీపీఎస్‌ ను వెంటనే రద్దు చేయాలని ఓపీఎస్‌ను పున రుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శుక్ర వారం జిల్లాలో జరిగే రోష్‌ మార్చ్‌ను ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలుపర్చా లని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం త గిన విధంగా స్పందించకపోతే ఆగస్టు 23 నుం చి వివిధ రూపాల్లో తమ కార్యక్రమాలు నిర్వ హిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్ర మంలో జిల్లా అసోసియేట్‌ అఽధ్యక్షుడు వేముల సైదులు, టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌ కుమార్‌, డివిజన్‌ అధ్యక్షుడు రాజేందర్‌, వివిధ మండలాల బాధ్యులు స్వామి, రాములు, మల్లేష్‌, రవీందర్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

మిస్సింగ్‌ క్రెడిట్స్‌ జమ చేయాలి

ఉప్పునుంతల : మండల కేంద్రంలోని తహ సీల్దార్‌ కార్యాలయం ముందు గురువారం సీపీ ఎస్‌ ఉద్యోగుల మిస్సింగ్‌ క్రెడిట్‌పై ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సనాతన బాలస్వామి అవగా హన కల్పించారు. 2004 సెప్టెంబరు 1 నుంచి జాయిన్‌ అయిన ఉద్యోగులకు సీపీఎం మిస్సింగ్‌ క్రెడిట్‌ చాలానే ఉన్నాయని, వాటిని ఎన్‌ఎస్‌డీ ఎల్‌ యూప్‌ ద్వారా తెలుసుకొని డీడీవో ద్వారా జమ చేసుకునే అవకాశం ఉందన్నారు. నూత న పెన్షన్‌ విధానం అనేది ఉద్యోగుల పాలిట శాపమని జిల్లా ఉపాఽఽధ్యక్షుడు గోపాల్‌ అన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని ప్రకటించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉ పతహసీల్దార్‌ పరశునాయక్‌, ఆర్‌ఐ రామకృష్ణ, బలరాం, టీఎన్జీవో నాయకులు గణేష్‌, సీపీఎస్‌ ఉద్యోగులు చందర్‌, లక్ష్మణ్‌, వెంకటేస్‌, ఆదిత్య తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:17 PM