Share News

Bayyaram project: బయ్యారం ఎత్తిపోతల పథకం అంచనాల సవరణ

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:25 AM

ఖమ్మం జిల్లా మధిర మండలం వైరా నది కుడిగట్టు నుంచి చేపట్టదలచిన బయ్యారం ఎత్తిపోతల పథకానికి రూ.3.34 కోట్లతో పరిపాలనపరమైన...

Bayyaram project: బయ్యారం ఎత్తిపోతల పథకం అంచనాల సవరణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా మధిర మండలం వైరా నది కుడిగట్టు నుంచి చేపట్టదలచిన బయ్యారం ఎత్తిపోతల పథకానికి రూ.3.34 కోట్లతో పరిపాలనపరమైన అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని రూ.3.39 కోట్లతో చేపట్టడానికి ప్రతిపాదనలు రాగా.. ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన అనంతరం రూ.3.34 కోట్లకు కుదిస్తూ జీవో నెం.22ను జారీ చేసింది. ఐఎస్‌ కోడ్‌లు, మార్గదర్శకాల ప్రకారం ధరలు ఖరారు చేయాలని, ఎలకో్ట్ర మెకానికల్‌ కాంపొనెంట్‌కు ఎత్తిపోతల పథకం సలహాదారుడు పెంటారెడ్డి నుంచి అనుమతి తీసుకోవాలని, డిజైన్లు/డ్రాయింగ్‌లకు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఆమోదం తీసుకోవాలని నిర్దేశిస్తూ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా సోమవారం జీవో జారీ చేశారు. ఇక ఇదే ఖమ్మం జిల్లా మధిర మండలం జాలిముడి గ్రామంలో జాలిముడి ఆనికట్‌ కుడి, ఎడమ కాలువల మరమ్మతులకు రూ.5.23 కోట్లతో పరిపాలనపరమైన అనుమతినిస్తూ మరో జారీ చేశారు. ఉపరితల చిన్న నీటిపారుదల పథకాల అమలు కోసం రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - Sep 16 , 2025 | 05:25 AM