Share News

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:21 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లను ఆలయ ఈవో ఎస్‌.వెంకట్రావు, డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ పరిశీలించారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన

యాదగిరిగుట్ట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లను ఆలయ ఈవో ఎస్‌.వెంకట్రావు, డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ పరిశీలించారు. ఆలయ ఉత్తర తిరువీధిలో శనివారం వారు పర్యటించి మాట్లాడారు. ఈ నెల 30న జరిగే ముక్కోటి పర్వదినానికి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తారనే అంచనాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాటు, భద్రతా ప్రమాణాల దృష్ట్యా భక్తుల వస్తు సామగ్రి తనిఖీ చేసేందుకు కొత్త బ్యాగేజీ స్కానర్‌ ట్రయల్‌రన్‌ చేసినట్లు తెలిపారు. వారివెంట యాదగిరిగుట్ట ఏసీపీ పి.శ్రీనివాసులునాయుడు, ఆలయ డీఈవో దోర్భల భాస్కరశర్మ, సివిల్‌ విభాగం ఈఈ జిల్లెల దయాకర్‌రెడ్డి, ఎస్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కే.శేషగిరిరావు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:21 AM