Share News

గ్రామాల వరకు రెవెన్యూ సేవలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:42 PM

గ్రామ స్థా యి వరకు రెవెన్యూ సేవల ను ప్రభుత్వం అందిస్తున్న ట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. భూభా రతి రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం రానుందని ఆ యన పేర్కొన్నారు.

గ్రామాల వరకు రెవెన్యూ సేవలు
కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామం రెవెన్యూ సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పక్కన ఆర్డీవో శ్రీను, తహసీల్దార్‌ ఇబ్రహీం

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ - ప్రజల అర్జీలపై కలెక్టర్‌ ప్రత్యక్ష సమీక్ష

కల్వకుర్తి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : గ్రామ స్థా యి వరకు రెవెన్యూ సేవల ను ప్రభుత్వం అందిస్తున్న ట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. భూభా రతి రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం రానుందని ఆ యన పేర్కొన్నారు. సదస్సు లను రైతులు సద్వినియో గం చేసుకోవాలని ఆయన కో రారు. కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో నిర్వ హిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ గురువారం ఆకస్మి కంగా పరిశీలించారు. రెవెన్యూ సదస్సులో రైతు ల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకు న్నారు. అర్జీదారులతో ముఖాముఖిగా కలెక్టర్‌ చర్చలు జరిపి వారు ఎదుర్కొంటున్న భూ సం బంధిత సమస్యలను సవివరంగా తెలుసుకు ని సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ భూ భారతి రెవెన్యూ సదస్సులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అవి ఆన్‌లైన్‌లో నమోదవుతున్నా యా అని అధికారులను ప్రశ్నించారు. దరఖా స్తు నమోదు ప్రక్రియలో తప్పిదాలకు తావు లే కుండా జాగ్రత్తగా వ్యవహరించాలని స్వీకరిం చిన ప్రతీ దరఖాస్తుకు రసీదులు ఇవ్వాలని, సం బంధిత రిజిస్టర్‌లో స్పష్టంగా వివరాలు నమో దు చేయాలని ఆదేశించారు. సదస్సులో హెల్ప్‌ డెస్క్‌లను, నమోదు పత్రాలను, విభజన విధా నాన్ని పరిశీలించిన కలెక్టర్‌ సమస్యల ప్రకారం గా దరఖాస్తులను వర్గీకరించి పక్కాగా రికార్డు చేయాలని సూచించారు. జూన్‌ 20వరకు జిల్లా లోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వ హించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. భూములపై సమస్యలు ఉన్న ప్రజలు సదస్సులను వినియో గించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, తహసీల్దార్‌ ఇబ్రహీం, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

భూ భారతిపై సర్వేయర్లకు అవగాహన

నాగర్‌కర్నూల్‌ : భూభారతి చట్టం అమలు లో భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర అత్యం తకీలకమని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని కొల్లాపూర్‌ చౌరస్తా సమీపంలో గల రైతు వేదికలో లైసెన్స్‌డ్‌ సర్వే యర్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జూలై 28, 29 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందని ఈ పరీక్షలో ఉత్తీర్ణులై న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేస్తుందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. పొలాల్లో స్వయంగా సర్వేచేయించి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భా గంగా భూమి కొలతలు, సరిహద్దుల గుర్తింపు, రికార్డుల నమోదు వంటి అంశాలపై సర్వేయ ర్లకు ఆచరణాత్మక శిక్షణనిచ్చారు. ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా ఏడీ సర్వేయర్‌ నాగేందర్‌, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:42 PM