Share News

kumaram bheem asifabad- గ్రామాల్లో రెవె‘న్యూ’ పాలన

ABN , Publish Date - Sep 09 , 2025 | 09:57 PM

సుమారు నాలుగేళ్ల క్రితం గ్రామాల్లో దూరమైన రెవెన్యూ సేవలు మళ్లీ మొదలయ్యాయి. గత ప్రభు త్వం గ్రామాల్లో రద్దు చేసిన రెవెన్యూ వ్యవస్థకు పూర్వవైభవం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది గ్రామ పాలన అధికారులకు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేయగా కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే క్లస్టర్‌ గ్రామపం చాయతీలను కేటా యిస్తూ సోమవారం నియామక పత్రాలను అందిం చారు. జి

kumaram bheem asifabad- గ్రామాల్లో రెవె‘న్యూ’ పాలన
కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేను కలిసిన జీపీవోలు

- జిల్లాలో 170 క్లస్టర్ల ఏర్పాటు

- విధుల్లో చేరిన 52 మంది జీపీవోలు

- అందుబాటులోకి రానున్న సేవలు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సుమారు నాలుగేళ్ల క్రితం గ్రామాల్లో దూరమైన రెవెన్యూ సేవలు మళ్లీ మొదలయ్యాయి. గత ప్రభు త్వం గ్రామాల్లో రద్దు చేసిన రెవెన్యూ వ్యవస్థకు పూర్వవైభవం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది గ్రామ పాలన అధికారులకు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేయగా కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే క్లస్టర్‌ గ్రామపం చాయతీలను కేటా యిస్తూ సోమవారం నియామక పత్రాలను అందిం చారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 170 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీపీ వోలను నియమించారు. వీఆర్‌ఏ, వీఆర్‌వోల నుంచి ఆర్హత ఉన్న వారిని రాత పరీక్ష ద్వారా 52 మంది జీపీవోలుగా ఎంపిక కాగా మిగతా జూనియర్‌ అసి స్టెంట్లను ఇన్‌చార్జి జీపీవోలుగా నియమించారు. దీంతో భూభారతి పోర్టల్‌, రెవెన్యూ రికార్డుల నిర్వహ ణ, ఫిర్యాదులు వేగంగా పరిష్కరం కానున్నాయి.

- ఉమ్మడి రాష్ట్రంలో..

గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సేవల కోసం 2007 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదే శ్‌లో వీఆర్‌ఏ, వీఆర్‌వో వ్యవస్థను తీసుకువచ్చారు. వీఆర్‌ఏ, వీఆర్‌వో వ్యవస్థపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో వీఆర్‌ఏ, వీఆర్‌వోవ్యవస్థను రద్దు చేసింది. అప్పటి నుంచి సర్వీసు కొల్పోయి కేడర్‌ తగ్గించుకొని వివిధ శాఖల్లో వీఆర్‌వో, వీఆర్‌ఏలు చాలా ఇబ్బందులు పడుతూ పని చేశారు. అప్పట్లో కొన్ని నెలల పాటు సర్దుబాటు కూడ చేయకపోవడంతో ఏంచేస్తారో తెలియక అవస్తలు పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చి ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. గతంలో రెవెన్యూ రికార్డులు నిర్వహించిన వీఆర్వో, వీఆర్‌ఏలు లేక పోవడంతో భూ వివదాల పరిష్కారం వేగవంతంగా జరుగక పోవ డంతో ప్రభుత్వం రెవెన్యూ క్లష్టర్లను ఏర్పాటు చేసి గ్రామపాలన అధికారులుగా నియమించారు. ఇందు కోసం వీఆర్‌ఏ, వీఆర్వోల విద్యా ఆర్హతల అధారంగా రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి విదులను అప్పగించారు.

- మళ్లీ గ్రామ పరిపాలన వ్యవస్థ..

జిల్లాలో 170 రెవెన్యూ క్లస్టర్లలో మళ్లీ గ్రామ పరిపాలన వ్యవస్థ మొదలైంది. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత భూ వివదాల పరి ష్కారం జఠిలంగా మారింది. చిన్న విషయానికి కూ డా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ లేదా కలెక్టర్‌ వద్దకు వెళ్లాల్సి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అప్పిలేట్‌ అథారిటీగా ఉన్న ఆర్డీవో, అదనపు కలె క్టర్‌, కోర్టులు కూడా లేక పోవడంతో కలెక్టర్‌ లేదా కోర్టుకు వెళ్లడమే అన్నట్లుగా మారింది. జీపీఓల నియామకం తర్వాత ప్రభుత్వం వారికి మార్గదర్శ కాలను జారీ చేసింది. గతంలో ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏ విదులతో పాటు భూభారతి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో కీలకంగా పని చేయాల్సి ఉంటుంది. గ్రామస్థాయిలో అన్ని ధృవ పత్రాల జారీలో విచారణ నిర్వహించనున్నారు. విద్యార్హత, నివాసం, కులధ్రు వీకరణ పత్రాల జారీకి విచారణలు ప్రభుత్వ భూ ములు, చెరువులు, కుంటలు, చెట్ట పరిరక్షణ, భూము ల సర్వే, కొలతలకు సహాయకులుగా వ్యవహరిస్తారు. సంక్షేమ పథకాలకు సంబందించి లబ్ధిదారులను గుర్తించడం గ్రామ స్థాయిలో శాఖల మధ్య సమన్వయ కర్తలుగా కూడా వ్యవహరిస్తారు.

నియామకపత్రాలు అందజేశాం..

- వెంకటేష్‌ దోత్రే, జిల్లా కలెక్టర్‌

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 52 మంది గ్రామ రెవెన్యూ అధికారులను కేటాయించి నియామక పత్రాలను అందజేస్తాం. జిల్లాలో 170 రెవెన్యూ క్లస్టర్లలో గ్రామపరిపాలన అధికారులను నియమిం చాం. గ్రామ పరిపాలన అధికారుల నియామకంతో గ్రామాల్లో భూ వివాదాలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది.

Updated Date - Sep 09 , 2025 | 09:57 PM