Corruption: భూరికార్డులు సరి చేసేందుకు 5,000 లంచం
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:07 AM
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామ రైతు భూ రికార్డులను సరి చేయడానికి..
నారాయణపేట జిల్లాలో ఏసీబీకి చిక్కిన మద్దూర్ ఆర్‌ఐ
మద్దూర్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామ రైతు భూ రికార్డులను సరి చేయడానికి రూ.5,000 లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) కె. అమర్‌నాథ్ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పిరెడ్డిపల్లి రైతు భూ రికార్డుల్లో మిస్ అయిన 5గుంటల భూమిని పట్టాదార్ పాస్‌బుక్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు గాను రూ.5,000 లంచం ఇవ్వాలని ఆర్‌ఐ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారి సూచన మేర కు సోమవారం ఆర్‌ఐకి రూ.5,000 అందజేశాడు. ఆ వెంటనే ఆర్‌ఐను పట్టుకుని కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.