Share News

రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 02 , 2025 | 11:30 PM

ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ హౌ జింగ్‌ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచిం చారు.

రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి
మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోపాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు

సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాస రెడ్డి

నస్పూర్‌, ఏప్రిల్‌ మే 2 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ హౌ జింగ్‌ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచిం చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్ట ల్‌, గృహ నిర్మాణశాఖ ఎండీ గౌతమ్‌, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ క్రిస్టియానా, జడ్‌ చంగ్తులతో కలిసి శుక్రవారం కలెక్టర్‌, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, నీట్‌ పరీక్షలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్‌వోఆర్‌ చట్టంపై మొదటివిడతగా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లోని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరించేం దుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలంలో ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ స మస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. జూన్‌ 2వ తేదీ వరకు పైలెట్‌ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్‌వోఆర్‌చట్టంలో భాగంగా పైలెట్‌ మండలంగా జిల్లాలోని భీమారం మండలాన్ని ఎం పిక చేసినట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నీట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేం దుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1204 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, గృహ నిర్మాణ ప్రాజెక్టు అధికారి బన్సిలాల్‌, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, ఏసీపీ ప్రకాశ్‌, భూ సర్వే ఏడీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌లు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:30 PM