CM Revanth Reddy: ఆటా మహా సభలకు రేవంత్‌కు ఆహ్వానం
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:55 AM
వచ్చే ఏడాది జూలై 31న అమెరికాలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 19వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని...
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జూలై 31న అమెరికాలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 19వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. గురువారం ముఖ్యమంత్రిని ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ సతీశ్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాసభల లక్ష్యాలు, కార్యక్రమాల వివరాలను సీఎంకు తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఆటా కీలక పాత్ర పోషిస్తోందని రేవంత్ ప్రశంసించారు. తెలుగు ఐక్యతను ప్రపంచ స్థాయిలో చాటేలా ఈ మహాసభలను నిర్వహించేందుకు సహకరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.