Share News

రిటైర్మెంట్‌ కాలపరిమితి తగ్గించాలి

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:10 AM

రాష్ట్ర ప్రభు త్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ కాలపరిమితిని 61 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని విశ్రాంత ఐఏఎస్‌ అదికారి చి రంజీవులు అన్నారు.

రిటైర్మెంట్‌ కాలపరిమితి తగ్గించాలి
మాట్లాడుతున్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు

సూర్యాపేటఅర్బన్‌,జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ కాలపరిమితిని 61 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని విశ్రాంత ఐఏఎస్‌ అదికారి చి రంజీవులు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పద్మశాలీ భవన్‌లో జరిగిన నిరుద్యోగ విద్యార్థి మహాసభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు శాంతియుతంగా పోరాటం చేసి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్రంలో రో జురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతోందన్నారు. ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాదిఅవకాశాలు లేక ఇ బ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో సేవాలాల్‌సేన వ్యవస్థాపకులు సంజీవ్‌నాయక్‌, వేణుకుమార్‌, రా జు, జీవీగౌడ్‌, ఇంద్రానాయక్‌, అర్జున్‌, దామోదర్‌రెడ్డి, నర్సి ంహానాయక్‌, నాగేశ్వర్‌నాయక్‌, భద్రునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:10 AM