Minister Ponguleti Responds Positively: రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను ఇవ్వాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:36 AM
రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను సౌకర్యం కల్పించాలని కోరుతూ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు..
మంత్రి పొంగులేటికి వయోధిక పాత్రికేయుల వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను సౌకర్యం కల్పించాలని కోరుతూ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రెవిన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి వయోధిక పాత్రికేయుల సంఘం ప్రతినిధులు గురువారం వినతిపత్రం సమర్పించారు. జర్నలిజం ప్రధాన వృత్తిగా దశాబ్దాలుగా సేవలు అందించి పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో వృద్ధాప్యంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటిని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు.