Cyber Fraud and Mental Harassment: సైబర్ నేరగాళ్ల వేధింపులు..ప్రాణాలు కోల్పోయిన విశ్రాంత వైద్యురాలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:33 AM
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన ఓ విశ్రాంత వైద్యురాలు.. సొమ్ములు పోగొట్టుకోవడమేగాక ప్రాణాలు కూడా కోల్పోయారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన...
డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి రూ.6.6 లక్షల కొట్టేశారు
వేదనకు గురై గుండెపోటుతో మరణించిన విశ్రాంత డాక్టర్
హైదరాబాద్‌సిటీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన ఓ విశ్రాంత వైద్యురాలు.. సొమ్ములు పోగొట్టుకోవడమేగాక ప్రాణాలు కూడా కోల్పోయారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన 76 ఏళ్ల విశ్రాంత వైద్యురాలు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆమె ఫోన్‌ను పరిశీలిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు గుర్తించారు. మృతురాలితో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వీడియోకాల్స్ చాలాసార్లు మాట్లాడారు. ఆమె తన ఖాతాల నుంచి వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు 6.6 లక్షలు బదిలీ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకొని, ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ వేదనతోనే గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానించారు. వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి ఫోన్‌లో కాల్‌డేటా, డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా సైబర్ నేరగాళ్ల వేధింపుల వల్లనే బాధితురాలు మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు.. 6.6లక్షలు కొల్లగొట్టినట్లు నిర్ధారణకు వచ్చారు.