పిర్యాదులపై తక్షణమే స్పందించాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:14 AM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన పిర్యాదుల విషయంలో అధికా రులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి భాస్కర్ అన్నారు. వా ర్షిక తనిఖీల్లో భాగంగా శనివారం లక్షెట్టిపేట ప ట్టణ పోలీస్ స్టేషన్‌ను శనివారం డీసీపీ తనిఖీ చే సారు.
మంచిర్యాల డీసీసీ బాస్కర్
లక్షెట్టిపేట, ఆగస్టు30 (ఆంధ్రజ్యోతి): పోలీస్ స్టేషన్‌కు వచ్చిన పిర్యాదుల విషయంలో అధికా రులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి భాస్కర్ అన్నారు. వా ర్షిక తనిఖీల్లో భాగంగా శనివారం లక్షెట్టిపేట ప ట్టణ పోలీస్ స్టేషన్‌ను శనివారం డీసీపీ తనిఖీ చే సారు. పోలీస్ స్టేషన్ రిసిప్షన్‌తో పాటు క్రైమ్ వా హనాలు పరిసరాలు పరిశీలించారు. స్టేషన్‌లో ప లు రికార్డులను పరిశీలించిన డీసీపీ పోలీసు వి ధుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసులపై న మ్మకాన్ని కల్పించడంతోపాటు పోలీసుల పట్ల ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ప్రతీ పోలీసు ఉద్యోగి మంచి నిబద్దత, నిజాయి తీతో పని చేయాలని పోలీసులకు వచ్చిన ఫిర్యా దులను మర్యాదపూర్వకంగా తీసుకోవాలన్నారు. పోలీసు వృత్తి క్రమశిక్షణతో కూడిన వృత్తి అన్నా రు. స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ తమకు ఏ లాంటి సమస్యలు ఉన్న చెప్పాలని వాటి పరిష్కా రం కోసం కృషి చేస్తానన్నారు. స్టేషన్ తనిఖీకి వచ్చిన డీసీపీకి పట్టణ సీఐ రమణ మూర్తి, ఎస్సై గోపతి సురేష్ పూల మొక్కలను అందించి స్వా గతం పలికారు. స్టేషన్ ఆవరణలో డీసీపీ మొక్క లను నాటి అనంతరం గౌరవ వందనం స్వీక రించారు. ఈకార్యక్రమంలో డీసీపీ వెంట మంచి ర్యాల ఏసీపీ ప్రకాష్ ఉన్నారు.