ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:26 PM
ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించేలా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి సుధీర్ బాల్ పేర్కొన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికా రులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించేలా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి సుధీర్ బాల్ పేర్కొన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తుల నిర్వమణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహన సంస్థ సంయు క్తంగా అన్ని శాఖల సమన్వయంతో పరిశ్రమాల్లో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజా రక్షణ చర్యలు తీ సుకోవాలని తెలిపారు. కాప్ వ్యవస్థ, అత్యవసర నిర్వహన కేంద్రా లపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్షాల సమ యంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ముందుగా హెచ్చ రికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌లు వారి పరిధిలోని విపత్తు ప్రభావిత ప్రాంతాలను తక్షణమే గుర్తించాలని, క్రమ బద్దమైన నిర్వహణ ప్ర క్రియ కలిగి ఉండాలని తెలిపారు. ఈ నెల 22వ తేదీన అన్ని జి ల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయా లన్నారు. చెన్నూరు మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై మాట్లాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల రక్షణ దిశగా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.