Share News

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:37 PM

ఒక్కేసి పువ్వేసి చందమామ...ఒక్కజాములాయే చందమామ అంటూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఆదివారం జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని వి శ్వనాథ ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరి గాయి.

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ
మంచిర్యాలలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఒక్కేసి పువ్వేసి చందమామ...ఒక్కజాములాయే చందమామ అంటూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఆదివారం జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని వి శ్వనాథ ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరి గాయి. సాయంత్రం ప్రధాన కూడళ్ల వద్ద , ఆలయాల వద్ద బతుకమ్మలను పెట్టి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మార్మోగిపోయాయి. అనంత రం జన్మభూమినగర్‌చెరువులో, ప్రధానకూడళ్ల వద్ద, రాళ్లవా గులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కాగా విశ్వనాథ ఆల యం ప్రధాన అర్చకుడు నరహరిశర్మ మాట్లాడుతూ తెలంగాణ అస్థిత్వం, ఆచార వ్యవహరాలకు బతుకమ్మ పండగ అద్దం ప డుతుందన్నారు. మంచిర్యాల మార్కెట్‌ ప్రాంతంలో ఉదయం వ్యాపారులు వివిధ రకాల పూలను విక్రయించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌లో పూలను కొనుగోలు చేశారు.

మందమర్రిటౌన్‌ : పట్టణంలోని మహిళలు ఆదివారం ఎం గిలిపూల బతుకమ్మ సందర్భంగా గృహాల్లో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. అనంతరం పసుపు కుంకుమలతో గౌ రమ్మలను తయారు చేసి బతుకమ్మలో పెట్టారు. పూలను పూ జించే ఏకైక పండగ బతుకమ్మ కావడంతో మహిళలందరు ఆనందంగా ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకున్నారు.

దండేపలి : మండలంలోని ఊరురా అన్ని గ్రామాల్లో ఆది వారం రాత్రి ఎంగిలి పువ్వుల బతుకమ్మ ఘనంగా జరుపుకు న్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో వాడ వాడల మహిళ బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.

భీమారం : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఆదివా రం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు,యువతులు ఉదయం తీరొక్క పూలతో బతుకమ్మ లను పేర్చి పూజలు చేశారు. సాయంత్రం ప్రధాన కూడళ్లు, ఆ లయాల వద్ద బతుకమ్మలను పెట్టి నృత్యాలు చేశారు.

Updated Date - Sep 21 , 2025 | 11:37 PM