రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:14 PM
భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా భూస మస్యల పరిష్కారమవుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మం డలంలోని మిట్టపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనా రాయణలతో కలిసి సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా భూస మస్యల పరిష్కారమవుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మం డలంలోని మిట్టపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనా రాయణలతో కలిసి సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మా ట్లాడుతూ భూభారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు ని ర్వహించి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ దర ఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధి కారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 20 వరకు జిల్లాలో భీమారం మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్ర మంలో సిబ్బంది పాల్గొన్నారు.
భీమారం : భూభారతి చట్టంలో బాగంగా పైలెట్ మండలంగా ఎంపికైన భీమా రం మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధ వారం భీమారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తుల ప్రక్రి యను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ భీమారం మండలాన్ని పైలెట్ మండలం గా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించిన భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించామన్నారు. స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. తిర స్కరించబడిన దరఖాస్తులకు సంబంధించి వివరాలు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ప్రత్యేక తహసీల్దార్ జ్యోతి, రాంచందర్‌లు ఉన్నారు.