New Liquor Shops: మద్యం షాపులకు రిజర్వేషన్ల ఖరారు
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:25 AM
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 2,620 మద్యం దుకాణాల్లో గౌడసామాజిక వర్గంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోటా ఖరారైంది. ఎక్సైజ్‌శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం..
గౌడలకు 398, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131
లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 2,620 మద్యం దుకాణాల్లో గౌడసామాజిక వర్గంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోటా ఖరారైంది. ఎక్సైజ్‌శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. గౌడ కులస్తులకు 398, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున మద్యం దుకాణాలు కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రా పద్ధతిన షాపుల కేటాయింపు పూర్తి చేశారు. కొత్త మద్యం దుకాణాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో శుక్రవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అయితే, మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరూ దరఖాస్తు చేయలేదు.