Share News

MLA Medipalli Satyam: రిజర్వేషన్ల కేటాయింపు సరిగా లేదు

ABN , Publish Date - Sep 27 , 2025 | 03:23 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానాలను రిజర్వు చేసే ప్రక్రియ కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో సరిగా జరగలేదనే ఆరోపణలు వస్తున్నాయని అధికార...

MLA Medipalli Satyam: రిజర్వేషన్ల కేటాయింపు సరిగా లేదు

  • కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో ప్రక్రియ మళ్లీ చేపట్టాలి

  • సీఎ్‌సకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫిర్యాదు

కరీంనగర్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానాలను రిజర్వు చేసే ప్రక్రియ కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో సరిగా జరగలేదనే ఆరోపణలు వస్తున్నాయని అధికార కాంగ్రె్‌సకు చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ ప్రక్రియను తిరిగి జరిపించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాలు కరీంనగర్‌ జిల్లాతోపాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ఉన్నాయి. అయితే జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరగలేదనే ఆరోపణలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 03:23 AM