Share News

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కోసం మంత్రికి వినతి

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:28 PM

చ్చంపేట నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళ వారం డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ సచివాల యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామిని అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ కలి సి వినతిపత్రం అందజేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కోసం మంత్రికి వినతి
బ రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామిని కలిసి మాట్లాడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

- కార్మిక శాఖ మంత్రి వివేక్‌ను కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యో తి) : అచ్చంపేట నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళ వారం డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ సచివాల యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామిని అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ కలి సి వినతిపత్రం అందజేశారు. అమ్రాబాద్‌ మండలం రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వా మి దేవ స్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే గడ్డం వెంకటస్వామి పేరు పెడతామన్నా రు. సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చం పేటకు అవసరమైన నిధులు మంజూరు చే స్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నా రు. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గా పదోన్నతి పొందిన జె.మోహన్‌ నాయక్‌ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఎమ్మెల్యే ఆయనను సత్కరించారు

కాంగ్రెలో చేరిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

మన్ననూర్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన మన్ననూరు గ్రామానికి చెందిన ఉమామహే శ్వర గిరిజన తండా, బీసీ కాలనీలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కా ర్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి శ్రీనివాసులు, మాజీ కోఆఫ్షన్‌ సభ్యుడు రహీం, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నంది హన్మంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడు పిట్టల సురేష్‌, కాంగ్రెస్‌ నాయకులు రాజారాం, శివాజి,సంభు వెంకట్‌రమణ, జూలూరి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 11:28 PM