Pension Scheme: వయోధిక పాత్రికేయులకు పెన్షన్ ఇవ్వండి
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:18 AM
తమకు పెన్షన్ పథకం అమలు చేయాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డికి వయోధిక పాత్రికేయులు విజ్ఞప్తి చేశారు...
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి
తమకు పెన్షన్ పథకం అమలు చేయాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డికి వయోధిక పాత్రికేయులు విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టులకు కల్పిస్తున్న పెన్షన్, ఇతర వసతుల వివరాలను ఆయనకు వివరించారు. రాష్ట్రంలోనూ ఆయా వసతులు అమలయ్యలా చూడాలని కోరారు. ఇదే విషయమై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌ను కలిసిన రిటైర్డు జర్నలిస్టులు.. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు పెన్షన్, ఇళ్ల స్థలాలు, వైద్య వసతులు కల్పిస్తామని చేసిన వాగ్దానాలను గుర్తు చేశారు. ఈ విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లి.. వాటి అమలుకు కృషి చేస్తామని తమకు మహేశ్ గౌడ్ హామీ ఇచ్చారని వెల్లడించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంకను కలిసి.. వివిధ రాష్ట్రాల్లో జర్నలిస్టులకు వసతులు కల్పిస్తూ జారీ చేసిన జీవో ప్రతులను అందజేశారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.