Share News

kumaram bheem asifabad-కర్జెల్లి- గూడెం రోడ్డుకు మరమ్మతులు

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:31 PM

మండలంలోని కర్జెల్లి- గూడెం రోడ్డుకు కోటిన్నర రూపాయల అంచనాలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం రోడ్డును పరిశీలించారు

kumaram bheem asifabad-కర్జెల్లి- గూడెం రోడ్డుకు మరమ్మతులు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

చింతలమానేపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కర్జెల్లి- గూడెం రోడ్డుకు కోటిన్నర రూపాయల అంచనాలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ రోడ్డు మరమ్మతుల కోసం రూ.కోటిన్నర మంజూరు చేయించామని చెప్పారు. టెండర్ల ప్రక్రియ ముగిసిందని, త్వరలోనే పూర్తి స్థాయి మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు. ఫారెస్టు అధికారులను ఒప్పించి బీటీ రోడ్డు వేయించడానికి కృషి చేస్తామన్నారు. కొత్తగా బీటీ రహదారులు కర్జెల్లి- గంగాపూర్‌, గిన్నెలేటి- రవీంద్రనగర్‌, కౌటాల- తుమ్మిడిహెట్టి మధ్య నిర్మించడానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో పనులు మొదలు పెడతామని తెలిపారు. అనంతరం గూడెం పాఠశాలను సందర్శించి సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం, విద్యాపరంగా ఏర్పడుతున్న ఇబ్బందులను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి వరకు పాఠశాల అప్‌గ్రేడ్‌ చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు. గూడెం గ్రామానికి చెందిన పూల్‌చంద్‌ అనారోగ్యంతో బాధపడుతుండగా, కేతినికి చెందిన సుమన్‌ ఇటీవల వాగులో గల్లంతై మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఆర్‌అండ్‌బీ డీఈ లక్ష్మినారాయణ, ఏఈ క్రాంతి, పీఆర్‌ ఏఈ జీవన్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు రాజేందర్‌గౌడ్‌, విజయ్‌, రామన్న, మల్లయ్య, నానయ్య, రంగన్న, సుధాకర్‌, పవన్‌, నవీన్‌, మురళీ, తుకారాం, బక్కుబాయి, తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:31 PM