Share News

Sudhadevi Ramaraju Passes Away: రచయిత్రి సుధాదేవి రామరాజు కన్నుమూత

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:27 AM

ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ తెన్నేటి సుధాదేవి రామరాజు(73) ఆదివారం సాయంత్రం నల్లకుంటలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమెకు భర్త డాక్టర్‌ వంశీ రామరాజు.....

Sudhadevi Ramaraju Passes Away: రచయిత్రి సుధాదేవి రామరాజు కన్నుమూత

నల్లకుంట/చిక్కడపల్లి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ తెన్నేటి సుధాదేవి రామరాజు(73) ఆదివారం సాయంత్రం నల్లకుంటలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమెకు భర్త డాక్టర్‌ వంశీ రామరాజు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వంశీ ఇంటర్నేషనల్‌ సాంస్కృతిక సంస్థ అధినేత డాక్టర్‌ వంశీ రామరాజు సతీమణి డాక్టర్‌ తెన్నేటి సుధాదేవి తెలుగు అకాడమీలో ఉపసంచాలకులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా రచనలు కొనసాగించారు. తెలుగు సామెతలు, నాటికలతో సాహిత్య ప్రక్రియలో 20కిపైగా రచనలు చేసి పలు సంస్థలచే అవార్డులు, రివార్డులు అందుకున్నారు. నల్లకుంటలోని నివాసంలో సుధాదేవి భౌతికకాయాన్ని సినీ దర్శకుడు రేలంగి నరసింహరావు, నిర్మాత రామ సత్యనారాయణతోపాటు పలువురు ప్రముఖులు సందర్శించి, నివాళులర్పించారు. సుధాదేవి రామరాజు అంత్యక్రియలు సోమవారం ఉదయం అంబర్‌పేట శ్మశాన వాటికలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Nov 24 , 2025 | 04:27 AM