Share News

Telugu Poet Community: చిత్రకారుడు శంభు కన్నుమూత

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:55 AM

ప్రముఖ చిత్రకారుడు, కవి కె.శంభు ప్రసాద్‌ రెడ్డి(54) హఠాన్మరణం పొందారు. శనివారం మధ్యాహ్నం బాత్రూంలో ఉన్నప్పుడు గుండెపోటు...

Telugu Poet Community: చిత్రకారుడు శంభు కన్నుమూత

  • ప్రఖ్యాత కవి కె.శివారెడ్డి తనయుడు

  • చిత్రలేఖనంతో పాటు కవిత్వ రచనలోనూ ప్రవేశం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ చిత్రకారుడు, కవి కె.శంభు ప్రసాద్‌ రెడ్డి(54) హఠాన్మరణం పొందారు. శనివారం మధ్యాహ్నం బాత్రూంలో ఉన్నప్పుడు గుండెపోటు రావడంతో కుప్పకూలారు.గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను పిలిపించగా, శంభు అప్పటికే మరణించినట్లు వారు నిర్ధారించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు కవులు, రచయితలు వారి ఇంటికి వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రఖ్యాత కవి కె.శివారెడ్డి, రమాదేవీ దంపతుల కుమారుడైన శంభు ఎన్నో పుస్తకాలకు ముఖ చిత్రాలు గీశారు. కొంతకాలం బోధనా వృత్తిలోనూ పనిచేశారు. తండ్రి ప్రేరణతో కవిత్వం కూడా రాశారు. శంభు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 11 గంటలకు సరూర్‌నగర్‌లోని వీవీనగర్‌ శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - Sep 07 , 2025 | 06:57 AM