ఉద్యోగుల తాత్కాలిక బదిలీలతో ఉపశమనం...
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:38 PM
: రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా ఇతర జిల్లాలు, జోన్లకు బదిలీ అయి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల కు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు తాత్కాలికం గా ఉపశమనాన్ని కలిగించే విధంగా ఉన్నాయి.
-ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తున్న ఉపాధ్యాయులు
-శాశ్వత చర్యలకూ చొరవ చూపాలంటూ విన్నపం
-190 జీవోను స్వాగతిస్తున్న ఉద్యోగులు
మంచిర్యాల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా ఇతర జిల్లాలు, జోన్లకు బదిలీ అయి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల కు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు తాత్కాలికం గా ఉపశమనాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. 2021 డిసెంబరు 6న అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు తెచ్చిన 317 జీవోతో స్థానికతను కోల్పోయి నాలుగేళ్లుగా ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన విభజించేందుకు గాను 2021లో జీవో నెంబర్ 317ను విడుదల చేసింది. ఓ వైపు దీర్ఘకాలికంగా పెండింగ్ స మస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం...పదోన్నతు లు లేక అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయుల్లో బదిలీల జీవో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. బదిలీ ప్రక్రియలో స్థానికతకు పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీ ప్రా తిపదికన ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఇతర జిల్లాలకు కేటాయించే ప్రక్రియను చేపట్టింది. 2018 ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం 124 జీవో విడుదల చేసి, రాష్ట్రపతి ఉ త్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ద క్కుతాయని పేర్కొన్నప్పటికీ, 317 జీవో ద్వారా స్థానిక తకు ప్రాధాన్యత లేకుండానే ఆప్షన్ల ప్రక్రిను ముగిం చింది. సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో జూనియ ర్లకు తీరని నష్టం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమ య్యాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మంచిర్యాల జిల్లాలో విద్యాభ్యాసం పూర్తిచే సిన స్థానికుడైన ఉపాధ్యాయుడు జూనియర్ పేరుతో కొమరంభీం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాకో శాశ్వతంగా వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొనడంతో ఇబ్బందులు తప్పలేదు.
సొంత జిల్లా ఆశలు గల్లంతు...
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం 2016 లో జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చే సింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు ఉండగా వాటి సం ఖ్యను 33 జిల్లాలకు పెంచింది. దీంతో ఉద్యోగులు, ఉ పాధ్యాయులు ఇక తమ సొంత జిల్లాల్లోనే ఉద్యోగాలు చేసుకోవచ్చుననే తరుణంలో వారి ఆశలను గల్లంతు చే స్తూ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపట్టింది. ఈ ప్రక్రియను ఉద్యోగ, ఉపాధ్యాయులు నేటికీ జీర్ణించు కోలేకపోతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండిం గ్‌లో ఉండగా, కేవలం ఉద్యోగుల విభజన మాత్రం హ డావుడిగా చేపట్టడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రం గా మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా ల్లో సీనియారిటీ జాబితాలు పూర్తికాకముందే ఉపాధ్యా యుల నుంచి ఆప్షన్లు తీసుకోవడం, బదిలీల జాబితాలో నెలకొన్న తప్పుల సవరణ పూర్తిస్థాయిలో చేపట్టకుం డానే ఆప్షన్లను ముగించడంతో విమర్శలు రాజ్యమేలా యి. దీంతో సీనియారిటీ జాబితాలో తన పేరు ఏ నెం బరులో ఉందో, తనకంటే ముందు, వెనక ఎంత మంది ఉన్నారో తెలియక ముందే ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ప్రయారిటీ ప్రకారం జిల్లాల ఆ ప్షన్లున ఇవ్వాల్సి వచ్చిందని అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
జూనియర్లను పుట్టి ముంచిన జీవో...
హడావుడిగా తీసుకొచ్చిన 317 జీఓ కారణంగా జూ నియర్లు తమకు తీరని అన్యాయం జరిగిందనే భావన లో ఉన్నారు. తాము పుట్టి పెరిగిన జిల్లాలో కాకుండా అలాట్ చేయబడే ఇతర జిల్లాలో శాశ్వతంగా స్థానికు లుగా మారడాన్ని జూనియర్లు నేటికీ జీర్ణించుకోలేక పో తున్నారు. జిల్లాలో 33 ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొత్తం 4500పై చిలుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పని చేస్తుండగా, వారిలో సింహభాగం ఉపాధ్యాయులే ఉ న్నారు. జిల్లాలో 2840 ఉపాధ్యాయ పోస్టులు మంజూ రుకాగా 2500 మంది వరకు పని చేస్తున్నారు. వీరిలో వందల సంఖ్యలో జూనియర్లు ఇతర జిల్లాలకు బదిలీ పై వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు పడు తున్న ఇబ్బందులను ధృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ స ర్కారు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ విషయమై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందులో భాగంగా జోవో 317తో ఇబ్బందులు పడుతున్న వారికి తాత్కాలిక ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం జీవో 190ని ఇటీవల జారీ చేసింది. ఇందులో భాగంగా ఖాళీలు ఉన్నచోట తాత్కాలిక బదిలీలు, డిప్యు టేషన్లకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ బదిలీ ల్లో కూడా గరిష్టంగా మూడేళ్ల వరకు అనుమతిస్తుం డటంతో కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
నూతన జీవో జారీతో ఉపశమనం...
వేణుగోపాల్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు
నాలుగేళ్లుగా స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాల్లో విఽధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీవో 190 జారీతో కొంతమేర ఉపశమనం లభిస్తుంది. ఇక తమకు స్థానికత లభించదనే భావనలో ఉన్న వారికి ప్రభుత్వ చర్యలు మానసిక ప్రశాంతత చేకూ రుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విష యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
శాశ్వత చర్యలపైనా ధృష్టిసారించాలి....
రాజేంధర్, ఎస్జీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఇంతకాలం ఇతర జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. కుటుంబాలకు దూరంగా ఉంటున్న వా రికి కొంతకాలమైనా దగ్గరగా ఉండే అవకాశం లభిస్తుం ది. తాత్కాలికంగా ఇతర జిల్లా బదిలీలు, డిప్యుటేషన్లకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఈ విషయమై శాశ్వత చర్యలు చేపడితే సమంజసంగా ఉంటుంది.