Share News

అటవీ గ్రామాలకు ఊరట

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:21 PM

అటవీ ప్రాంతంలో బీటీ రోడ్డు మంజూరు చేసి, తమ దశాబ్దా ల కలను సాకారం చేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెంది న గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి ర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామ పంచా యతీ పరిధిలోని ఊట్ల నుంచి కుమరంభీం ఆసిఫాబా ద్‌ జిల్లా తిర్యాణి మండలం గుండాల వరకు దట్టమైన అడవిలో రోడ్డు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా వేడుకుంటున్నారు.

అటవీ గ్రామాలకు ఊరట

బీటీ రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

12 కిలోమీటర్ల మేర పనులకు రూ. 25 కోట్లు మంజూరు

ప్రభుత్వం నిర్ణయంతో తీరనున్న ప్రజల కష్టాలు

మంచిర్యాల-ఆసిఫాబాద్‌ జిల్లాలను కలిపేలా రోడ్డు నిర్మాణం

హర్షం వ్యక్తం చేస్తున్న రెండు జిల్లాల గిరిజనులు

మంచిర్యాల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతంలో బీటీ రోడ్డు మంజూరు చేసి, తమ దశాబ్దా ల కలను సాకారం చేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెంది న గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి ర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామ పంచా యతీ పరిధిలోని ఊట్ల నుంచి కుమరంభీం ఆసిఫాబా ద్‌ జిల్లా తిర్యాణి మండలం గుండాల వరకు దట్టమైన అడవిలో రోడ్డు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా వేడుకుంటున్నారు. ఇప్పటివరకు ఆ మా ర్గంలో సరైన రవాణా సౌకర్యంలేక ప్రజలు నానా ఇ బ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వా రి బాధలు అనేకం. కాలినడకన వెళ్లేందుకు కూడా మె టల్‌ రోడ్డు అనుకూలించే పరిస్థితులు లేవు. ప్రజల అ వస్థలు దృష్టిలో ఉంచుకొని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గ తంలో మెటల్‌ రోడ్డు వేసినప్పటికీ కాలక్రమంలో అది గుంతలుపడి, రాళ్లు తేలడంతో ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గుండాల గ్రామం కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉన్నప్పటికీ అక్కడి ప్రజలకు ఏ అవసరం వచ్చినా స మీపంలో ఉన్న మంచిర్యాల జిల్లాకే వస్తుంటారు. వై ద్యం, నిత్యావసర సరుకుల కొనుగోలు, ఇతరత్రా అవ సరాల కోసం గుట్ట మీద నుంచి కాలినడకన, ద్విచక్ర వాహనాలు, ఎడ్లబండ్లపై దట్టమైన అటవీప్రాంతం గుండా దండేపల్లి, మ్యాదరిపేట, లక్షెట్టిపేట, మంచి ర్యాల వరకు ప్రయాణం సాగిస్తారు. రోడ్డు సౌకర్యం బాగాలేక అత్యవసర సమయాల్లో వైద్య చికిత్సల కోసం రోగులను మంచంపై పడుకోబెట్టి తరలించిన సందర్భా లు అనేకం ఉన్నాయి. రెండు గ్రామాలు గిరిజన ప్రాం తాలు కావడంతో ఇంతకాలం నాయకులు, అధికారులు సైతం పెద్దగా ధృష్టిసారించలేదు.

రూ. 25 కోట్లు మంజూరు....

ఊట్ల-గుండాల గ్రామాలను అనుసంధానం చేసేలా బీటీ రోడ్డు నిర్మించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఫిబ్రవరిలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ కు లేఖ రాశారు. దండేపల్లి మండల కేంద్రంలోని ఆర్‌ అండ్‌బీ రోడ్డు నుంచి కర్నపేట, ఊట్ల మీదుగా గుం డాల వరకు 12 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేప ట్టవలసిన ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలోని 12 గిరిజన గ్రామాలను అనుసంధానం చేసేలా బీటీ రోడ్ల నిర్మాణానికి ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ నుంచి రూ. 465.55 కోట్లకు గత నెల 30న పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నంబర్‌ 240 జారీ చేసింది. ఇందులో దండేపల్లి నుంచి గుండాల వరకు ప్రతిపాధించిన రోడ్డుకు రూ. 25 కోట్లు కేటాయించడంపై ఆయా గ్రామాల గిరిజ నులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫ పర్యాటక అభివృద్ధికి దోహదం..

ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డు నిర్మాణానికి మార్గం సు గమంకాగా, ఆ ప్రాంత పర్యాటక అభివృద్ధికి సైతం దోహదపడనుంది. రోడ్డు నిర్మాణం జరిగితే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఉన్న ఊట్ల జలపాతం, పెద్దయ్య ఆలయం, సహ్యాద్రి పర్వతాలు (గుట్టలు), గు హలతోపాటు కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని గుం డాల జలపాతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకా శాలు ఉన్నాయి. అలాగే దట్టమైన అటవీ ప్రాంతం కా వడంతో వణ్యప్రాణులు, రకరకాల పక్షులతోపాటు ప చ్చని అటవీ ప్రాంతం పర్యాటకులకు కనువిందు చేయ నున్నాయి. ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకున్నా... వర్షాకా లంలో ప్రతియేటా పర్యావరణ ప్రేమికులు పెద్దసం ఖ్య లో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. రోడ్డు నిర్మాణం జరిగితే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగి, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అవకాశం ఎంతైనా ఉంది.

గిరిజనులకు ఎంతో ఉపయోగకరం...

కొట్నాక తిరుపతి, రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

దండేపల్లి నుంచి గుండాల వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం శుభపరిణామం. గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగం. గత ప్రభుత్వా లు ఏనాడూ ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదు. గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వానికి సమస్యను విన్నవించాను. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సైతం నిధులు మంజూరులో తనవంతు కృషి చేయ డంతో ఎట్టకేలకు మోక్షం లభించింది.

Updated Date - Sep 14 , 2025 | 11:22 PM