Share News

DVN Reddy: హ్యామ్‌ రోడ్లను సరే.. మా బకాయిలు కూడా విడుదల చేయండి

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:47 AM

రాష్ట్రంలోని రహదారులను హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌(హ్యామ్‌)లో అభివృద్ధి చేయాలన్న ప్రభు త్వ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు హర్షిస్తున్నామని..

DVN Reddy: హ్యామ్‌ రోడ్లను సరే.. మా బకాయిలు కూడా విడుదల చేయండి

  • రూ.800 కోట్లు ఉన్నాయి

  • సీఎం రేవంత్‌కు బీఏఐ జాతీయ ఉపాధ్యక్షులు డీవీఎన్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని రహదారులను హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌(హ్యామ్‌)లో అభివృద్ధి చేయాలన్న ప్రభు త్వ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు హర్షిస్తున్నామని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండి యా జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్‌ రెడ్డి శనివారం సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. అయితే హ్యామ్‌ పనుల కోసం టెండర్లను ఆహ్వానించడానికి ముందుగానే పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలని కోరారు. గత రెండేళ్లుగా రోడ్ల మరమ్మతులు, ప్యాచ్‌ వర్క్‌లు, అత్యవసర పనులు చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించి రూ.10 వేల నుంచి రూ.కోటి వరకు ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖల్లో దాదాపు రూ.800 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రూ. కోటిలోపు ఉన్న బిల్లులను ప్రభుత్వం వీలైనంత త్వరితగతిన విడుదల చేస్తుందని 2024 జనవరిలో హైటెక్స్‌లో నిర్వహించిన ఆల్‌ ఇండియా బిల్డర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో సీఎం రేవంత్‌ చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. తమ బకాయిలను విడుదల చేయాలని కోరారు.

Updated Date - Oct 19 , 2025 | 03:47 AM