Share News

kumaram bheem asifabad- ఆపద్బాంధవులు

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:56 PM

రాత్రి, పగ లు తేడా లేకుండా ఎక్కడైనా ప్రమాదం జరిగినా.. గర్భిణులకు పురిటినొప్పులు వచ్చినా.. నేనున్నానని మీకేంకాదని మనోధైర్యాన్ని కలిగించేది 108 అంబులెన్స్‌. 24 గంటలూ ప్రజల ప్రాణాలు కపా డేందుకు సిద్ధంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు, గుండెపోటు బారిన పడినవారికి అపార సంజీవనిగా మారింది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సమాచారం రాగానే సిబ్బంది స్పందించి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుంటారు.

kumaram bheem asifabad-  ఆపద్బాంధవులు
లోగో

- 24 గంటలు...365 రోజులు సేవలు

వాంకిడి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాత్రి, పగ లు తేడా లేకుండా ఎక్కడైనా ప్రమాదం జరిగినా.. గర్భిణులకు పురిటినొప్పులు వచ్చినా.. నేనున్నానని మీకేంకాదని మనోధైర్యాన్ని కలిగించేది 108 అంబులెన్స్‌. 24 గంటలూ ప్రజల ప్రాణాలు కపా డేందుకు సిద్ధంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు, గుండెపోటు బారిన పడినవారికి అపార సంజీవనిగా మారింది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సమాచారం రాగానే సిబ్బంది స్పందించి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఓ వైపు ప్రథమ చికిత్స అందిస్తూనే మరోవైపు ఆసుపత్రులకు తరలిస్తారు. సిబ్బంది తో డ్పాటుతో ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు.

- జిల్లాలో 60 మంది సిబ్బంది

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 108 అంబు లెన్స్‌ వాహనాలు 15 ఉండగా 30 మంది ఈఎం టీలు, 30 మంది పైలేట్‌లు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు 25,415 మంది బాదితులకు ఆసుపత్రికి తరలించారు. అనేక మంది గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువైతే కాన్పులు చేశారు. సమయం అంటూ లేకుండా నిరంతరం సేవలందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఉపాధి పొందడానికి ఈ వృత్తిలోకి వచ్చినా విధి నిర్వహణలో ఆపద్భాంవుల పాత్ర పోషిస్తున్నారు. వారే 108 వాహనంపై విధులు నిర్వర్తించే ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్‌), పైలెట్లు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని, అత్యవసర వైద్యసేవలు అవసరం ఉన్న వారికి, ప్రసవవేదన పడుతున్న గర్భిణులకు, అస్వస్థతకు గురైన వారిని వైద్య చికిత్స అందించి సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడుతున్నారు. 2025 జనవరి నుంచి 2025 సెప్టెంబరు వరకు మెడికల్‌ 18,631, గర్భిణులు 2,646, రోడ్డుప్ర మా దాలు 1,708, గుండే సమస్యలు 1,203, శ్వాసకోశ సమస్యలు 1,235 మందిని ఆసుపత్రికి తరలించారు.

సిబ్బందిని అప్రమత్తం చేస్తాం..

- మెరుగు నరేష్‌ యాదవ్‌, 108 ప్రోగాం మేనేజర్‌

ఎలాంటి సమస్యలతోనేనా 108కు సమాచారం వచ్చిన వెంటనే అత్యవసర వైద్యం అందించడానికి కృషి చేస్తాం. ఘటనాస్థలానికి వెంటనే చేరుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. 108 సిబ్బంది అనేక మంది ప్రాణాలు కాపాడారు. అనుకోని ఘట నలు జరిగినప్పుడు వెంటనే 108 వాహనాలకు సమాచారం అందించి అంబులె న్స్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

ఏడాది కాలంగా..

- ప్రవీణ్‌ యాదవ్‌, ఈఎంటీ

గత ఏడాది నుంచి ఈఎంటీగా 108లో పనిచేస్తు న్నాను. అత్యవస సమయాల్లో ఫోన్‌ రాగానే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్సలు చేయిస్తున్నాం గర్భిణులను ఆసుపత్రికి తరలించే క్రమంలో కొంతమందికి పురి టినొప్పులు రావడంతో మార్గమధ్యలోనే ప్రసవాలు చేశాం. తల్లీబిడ్డలను సురక్షితంగా ఆసుపత్రిలో చేర్చినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను.

సకాలంలో ఆసుపత్రులకు చేర్చుతున్నాం..

జంబుల సంతోష్‌, పైలేట్‌

బాధితులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చుతు న్నాం. 16 ఏళ్లుగా 108లో పైలెట్‌గా పనిచేస్తున్నాను. అత్యవసర సంయంలో వచ్చే ఫోన్‌ కాల్స్‌కు వెంటనే స్పందించి సకాలంలో ఘటన స్థలానికి చేరుకుం టాం. ఆపత్కాలంలో ఎంతో మందిని ఆసుపత్రులకు సకాలంలో చేర్చి వైద్యం అందించడంతో ప్రాణాలతో బయట పడ్డారు. ఇందులో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది.

Updated Date - Nov 04 , 2025 | 09:56 PM