Share News

Mental Distress: ఎవరూ పిల్లనివ్వడం లేదని.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:27 AM

మూడు పదుల వయస్సు దాటినా పెళ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు....

Mental Distress: ఎవరూ పిల్లనివ్వడం లేదని.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

ఆత్మకూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మూడు పదుల వయస్సు దాటినా పెళ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన బూర సురేందర్‌, రమ దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వివాహం కాగా, పెద్ద కుమారుడు నరేశ్‌ (32)కు నాలుగేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే, నరేశ్‌ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ బట్టల షాపులో పని చేస్తుండడంతో పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేశ్‌ మంగళవారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని మాధవరెడ్డి ఫ్ల్లై ఓవర్‌ సమీపంలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - Nov 13 , 2025 | 04:27 AM