పత్తి కొనుగోలులో నిబంధనలు సడలించాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:20 PM
పత్తి కొ నుగోళ్లలో సీసీఐ అవలం భిస్తున్న నిబంధనలను సడ లించి మొత్తం మిల్లుల్లో సీసీఐ కొనుగోలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పత్తి మిల్లు యజమానులు నాగుల వెంకటేశ్వర్లు, రఘు, పలువురు రైతులు డిమాండ్ చేశారు.
- విలేకరుల సమావేశంలో పలువురు రైతుల డిమాండ్
కల్వకుర్తి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : పత్తి కొ నుగోళ్లలో సీసీఐ అవలం భిస్తున్న నిబంధనలను సడ లించి మొత్తం మిల్లుల్లో సీసీఐ కొనుగోలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పత్తి మిల్లు యజమానులు నాగుల వెంకటేశ్వర్లు, రఘు, పలువురు రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం కల్వకుర్తి మండల పరిధిలోని కాటన్ మిల్లు సమీపంలోని తిరుమల జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఏ మిల్లులోనైనా పత్తిని దూది గింజలుగా వేరు చేసేందుకు సీసీఐ చెల్లి స్తున్న మొత్తం ఒక బేల్‌కు రూ.1440అని ఇదే ధరతో అన్ని మిల్లుల్లో మిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎల్-1, ఎల్-2, ఎల్-3 అంటూ విభజన ఎందు కని వారు ప్రశ్నించారు. ఎకరాకు 7క్వింటాళ్ల ప త్తిని మాత్రమే కొనుగోలు చేయాలనే నిర్ణయా న్ని విరమించుకోవాలని కోరారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12శాతం కంటే ఎక్కువ ఉంటే కొనాలని సీసీఐ స్పష్టం చేయడం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టడమే అన్నారు. కపాస్ కిసాన్ యాప్‌తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని గ్రామీణ రైతుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేవని పేర్కొన్నారు. పత్తి మిల్లు యజ మానులు, రైతులు పాల్గొన్నారు.