శాస్త్రోక్తంగా నిత్యపూజలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:32 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గురువారం నిత్య కైంకర్యాలు వైభవంగా నిర్వహిం చారు.
యాదగిరిగుట్ట, జూన్ 5(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గురువారం నిత్య కైంకర్యాలు వైభవంగా నిర్వహిం చారు. ప్రధానాలయ నైరుతి దిశలో అష్టభుజి ప్రాకార మండపలంలో ఉత్సవ మూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం చేపట్టారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విష్వక్సేనుడి తొలిపూజలతో కల్యాణతంతు కొనసా గింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారి శేషవస్త్రాలు అశీర్వచనం అందజేశారు. ముందుగా సుదర్శన శతక పఠనంతో హోమం పూజలు నిర్వహిం చారు. ప్రభాతవేళ గర్భాలయంలో స్వామిఅమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి అర్చకస్వాములు జాభిషేకం, నిత్యార్చనలు చేపట్టారు. పాతగుట్ట ఆఆలయంలో నిత్య పూజలు సాంప్రదాయ రీతిలో జరిగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.30,04,841 ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకట్రావ్ తెలిపారు.