శాస్త్రోక్తంగా నిత్య పూజలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:13 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నిత్య కైంకర్యాలు గురువారం పాంచారాత్రగమ శాస్త్ర రీతిలో నిర్వహించారు.
యాదగిరిగుట్ట, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నిత్య కైంకర్యాలు గురువారం పాంచారాత్రగమ శాస్త్ర రీతిలో నిర్వహించారు. ప్రధానాలయ నైరుతి దిశలో అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్రవైఢూర్యాలతో దివ్యమనోహ రంగా అలంకరించిన అర్చకులు గజవాహన సేవలో తీర్చిదిద్ది వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం నిర్వహిం చారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విశ్వక్సేనుడి తొలిపూజలతో కల్యాణ తంతు కొనసాగింది. ప్రభాతవేళ గర్భాలయంలో స్వామిఅమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చకులు నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆల యంలో నిత్య పూజలు సంప్రదాయ రీతిలో జరిగాయి. వివిధ విభా గాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 21,04,961 ఆదాయం సమకూ రినట్లు ఆలయ ఇన్‌చార్జి ఈవో గుగులోతు రవి తెలిపారు.
వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో విహ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగాళ్యధారణ తలంబ్రాలతో కల్యాణం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక, రుద్రాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు.