Share News

Ramchander Rao: ఆర్‌ఆర్‌ఆర్‌ మార్గాన్ని పునః సమీక్షించాలి

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:28 AM

రాష్ట్ర ప్రభుత్వం రీజినల్‌ రింగ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) రోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను పునఃసమీక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

 Ramchander Rao: ఆర్‌ఆర్‌ఆర్‌ మార్గాన్ని పునః సమీక్షించాలి

రైతుల భూములను కాపాడాలి: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రీజినల్‌ రింగ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) రోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను పునఃసమీక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. రైతుల భూములు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పుట్టపాక రైతులు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి రాంచందర్‌రావును కలిశారు. ప్రస్తుత అలైన్‌మెంట్‌ను మార్చి మళ్లీ సర్వే నిర్వహించకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. ఈసందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. రైతుల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. ప్రస్తుత అలైన్‌మెంట్‌తో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కాగా, హెచ్‌సీయూ ఎన్నికల్లో విజయం సాధించిన ఏబీవీపీని రాంచందర్‌రావు అభినందించారు.

Updated Date - Sep 22 , 2025 | 05:28 AM