Share News

రెడ్డి కులస్థులు సంఘటితం కావాలి

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:33 PM

రెడ్డి కులస్థులందరం సంఘటితం కావాలని, అంద రం కలిసి కట్టుగా ఉండి డిమాండ్లను సాధిం చుకోవాలని రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం కిష్టంపేట లో ని బీఎంఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ రెడ్డి ఆత్మీయ సమ్మేళనా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.

రెడ్డి కులస్థులు సంఘటితం కావాలి

మన సంప్రదాయ సంస్కృతులను భవిష్యత్‌ తరాలకు అందించాలి

రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్‌రెడ్డి

చెన్నూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : రెడ్డి కులస్థులందరం సంఘటితం కావాలని, అంద రం కలిసి కట్టుగా ఉండి డిమాండ్లను సాధిం చుకోవాలని రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం కిష్టంపేట లో ని బీఎంఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ రెడ్డి ఆత్మీయ సమ్మేళనా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. తీర ప్రాంత గ్రామాలకు చెందిన రెడ్డి కుల స్థులు కొందరు అప్పట్లో బీసీ సర్టిఫికెట్‌ పొంది తాము గాండ్ల రెడ్డిగా చెప్పుకున్నారన్నారు. ఆ స్వార్థపు ఆలోచనలు ఇక వద్దని, రెడ్డిగానే పు ట్టాం రెడ్డిగానే పెరిగాం రెడ్డిగానే చచ్చిపో దా మని రెడ్డికులస్థులు ఆత్మాభిమానాన్ని కించపరి చే చర్యలు ఎవరు చేయవద్దని పిలుపునిచ్చా రు. మన కులానికి సంబంధించి మన రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు ఉ న్నారని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రెడ్డి కమిషన్‌ ఏర్పాటు చేసుకుని సమస్యల సాధనకు కృషి చే యాలన్నారు. రెడ్డి కులస్థుల సంక్షేమానికి మన మంతా సంఘటితం కావాలని, ఇందుకోసం మ న కులస్థుల్లోని బీద వారికి చేయూతనం దిం చేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకోవాల న్నారు. బీద కుటుంబాల పిల్లలకు సహాయం అందించాలన్నారు. ఈ భావాలను మన భవిష్య త్‌ తరాలకు అందించాలని ఆయన కోరారు. ఈ పవిత్రమైన చెన్నూరు గడ్డ నుంచే రెడ్డి ఆత్మీయ సమ్మేళనం ప్రారంభమైందని, ఇది రాష్ట్ర, దేశ వ్యాప్తంగా విస్తరించాలని, ఇందుకు రెడ్డిలు సం ఘటితంగా ఏకమై ముందుకు రావాలని ఆయ న పిలుపునిచ్చారు. అనంతరం ఆయనను రెడ్డి సంఘం నాయకులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు గుర్రాల మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీధర్‌రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంతోషం గోపాల్‌రెడ్డి, నాయకులు పోటు రాంరెడ్డి, గొడిసెల బాపురెడ్డి, చల్ల రాం రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సత్తిరెడ్డి, రవీందర్‌ రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, మాజీ సర్పంచులు ముల్కల్ల ఉమ, ముల్కల్ల మాధవి పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:33 PM