Share News

Telangana Government: ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలకు మళ్లీ గుర్తింపు

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:30 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలపై చర్చించి, తగిన సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం బుధవారం రాష్ట్ర స్థాయి తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌..

Telangana Government: ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలకు మళ్లీ గుర్తింపు

  • 2014లో రద్దు చేసిన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. 9 సంఘాలకు గుర్తింపు.. ఉద్యోగ సంఘాల్లో హర్షం

  • మరో 6 సంఘాలకు రొటేషన్‌ పద్ధతిన సభ్యత్వం

  • సర్వీసు అంశాలపై సూచనలకు ‘జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌’ ఏర్పాటు

హైదరాబాద్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలపై చర్చించి, తగిన సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం బుధవారం రాష్ట్ర స్థాయి ‘తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు చాలా కాలం తర్వాత 9 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు గుర్తింపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశా రు. 2014లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసింది. దాంతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సంఘాలు ప్రాతినిధ్యం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనను గమనించిన ఆనాటి ప్రభుత్వం.. ఉద్యోగులను సంతృప్తిపర్చడానికి 2015లో ఏకంగా 43ు ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. కానీ.. బదిలీలు, పదోన్నతులు, 317 జీవో, డీఏలు, కారుణ్య నియామకాలు, సప్లిమెంటరీ బిల్లుల చెల్లింపు వంటి సమస్యలను పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేయడం ప్రారంభించాయి. బిల్లుల క్లియరెన్స్‌లో కొంత అసంతప్తి ఉన్నా.. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. అం దులో భాగంగానే తాజాగా సంఘాలకు ప్రభుత్వ గుర్తింపును, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటును సాధించాయి. ‘తెలంగాణ సివిల్‌ సర్వీసె్‌స (రికగ్నిషన్‌ ఆఫ్‌ సర్వీస్‌ అసోసియేషన్స్‌) రూల్స్‌-2001’ ప్రకారం 9 సంఘాలకు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యులు గా గుర్తింపునిచ్చింది. మరో ఆరు సంఘాలకు రొటేషన్‌ పద్ధతిలో సభ్యత్వం కల్పించింది. ప్రభుత్వం తరఫున 12 మంది అధికారులను సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నామినేట్‌ చేసే ప్రత్యే క ప్రధాన/ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి కౌన్సిల్‌ చైర్మన్‌గా ఉంటారని ప్రభుత్వం తెలిపింది. భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌, ఆర్థిక, పురపాలక-పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన, విద్య, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, న్యాయ, షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన/ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, పాఠశాల విద్యా సంచాలకులు, ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌, సాధారణ పరిపాలన(సర్వీస్‌)శాఖ అదనపు/సంయుక్త/ఉప కార్యదర్శిలను జాయింట్‌స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా నియమించింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సి ల్‌ ఈ క్యాలెండర్‌ సంవత్సరం అంటే.. 2025 డిసెంబరు 31 వరకు మనుగడలో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ కౌన్సిల్‌ ప్రతి 4 నెలలకోసారి సమావేశమై ఉద్యోగుల సమస్యలను చర్చిస్తుంది. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సహకారాత్మక వాతావరణాన్ని కల్పించడం, ప్రజాసేవల్లో నాణ్యతను పెంపొందించ డం, ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం, ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరించడానికి యంత్రాంగం ఏర్పాటు వంటి విధులను కౌన్సి ల్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఉద్యోగుల విధు ల్లో మార్పులు, పనివేళలు, క్రమశిక్షణ, గౌరవ వేతనం, పదవీ విరమణలకు సంబంధించిన నియమాలను రూపొందించడం, ప్రభుత్వ యంత్రాంగ పనితనాన్ని పెంచడం వంటి సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.


ఉద్యోగుల జేఏసీ హర్షం

ఉద్యోగ సంఘాలకు గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ) చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు హర్షంవ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు కృత్ఞతలు తెలిపారు.

గుర్తింపు పొందిన సంఘాలు

1. తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ (టీఎన్‌జీవో సెంట్రల్‌ యూనియన్‌)

2. తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌

అసోసియేషన్‌ (కేంద్ర సంఘం)

3. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ తెలంగాణ

సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ (టీజీఎ్‌సఏ)

4. ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్‌డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్‌టీయూ టీఎస్‌)

5. స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌,

తెలంగాణ స్టేట్‌ (ఎ్‌సటీయూ టీఎస్‌)

6. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (ట్రెసా)

7. తెలంగాణ క్లాస్‌ - 4

సెంట్రల్‌ అసోసియేషన్‌

8. తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ టీచర్స్‌

ఫెడరేషన్‌ (టీఎ్‌స యూటీఎఫ్‌)

9. తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌

(టీఆర్‌టీఎ్‌ఫ)

రొటేషన్‌ పద్ధతిలో సభ్యత్వం పొందిన సంఘాలు

1. తెలంగాణ సెక్రటరియేట్‌ ఆఫీసర్స్‌

అసోసియేషన్‌(టీజీఎ్‌సవోఏ)

2. డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌

3. తెలంగాణ తహసీల్దార్స్‌

అసోసియేషన్‌ (టీజీటీఏ)

4. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ

సంఘం (టీపీయూఎస్‌)

5. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఎ్‌సటీఎ్‌ఫ)

6. గవర్నమెంట్‌ జూనియర్‌ లెక్చరర్స్‌

అసోసియేషన్‌

Updated Date - Sep 11 , 2025 | 04:30 AM