నామినేషన్ల స్వీకరణ సమర్ధవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:23 AM
రెండవ సాధారణ ఎన్నికల నేపద్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణల ప్రక్రియన్ ఎన్ని కల సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన లక్షెట్టిపేట మండలం లోని గుల్లకోట, పోతపల్లి, చందారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, నవంబరు, 27(ఆంధ్రజ్యోతి): రెండవ సాధారణ ఎన్నికల నేపద్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణల ప్రక్రియన్ ఎన్ని కల సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన లక్షెట్టిపేట మండలం లోని గుల్లకోట, పోతపల్లి, చందారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులను నామినేషన్ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రం ముందు ఫోటోతో ఓటర్ల జాబిదా అదే విధంగా గ్రామా ల వార్డుల వారిగా రిజర్వేషన్ల జాబిదా అంటించాలన్నారు. నామినేషన్ కేం ద్రాలకు వంద మీటర్ల పరిదిలో ఎవరూ గుంపులుగా రాకుండా చూసుకో వాలని రిటర్నింగ్ అధికారితో పాటు సహాయక రిటర్నింగ్ అధికారులక పలు సలహాలు సూచనలు అందజేసారు. అనంతరం మండలంలోని ఇటి క్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, లక్షెట్టిపే ట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న మార్చురి గది పనులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎమ్మార్వో దిలీప్ కుమార్, ఎంపిడీవో సరోజ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ఆకుల శ్రీనివాస్ ఉన్నారు.