kumaram bheem asifabad- ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ
ABN , Publish Date - Aug 30 , 2025 | 10:57 PM
గ్రామ పంచాయతీ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపైన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించి అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించామని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఆసిఫాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపైన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపైన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించి అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించామని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఆసిఫాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపైన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చరణ్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): ఓటర్ల సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఓటరు జాబితాపై అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే వార్డులోని కుటుంబంలోని ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఓటర్ల నమోదులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒక వార్డులోని కుటుంబ సభ్యుల ఓటర్లంతా ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకుంటామని ఇందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎంపీవో గౌరిశంకర్, ఏపీవో రాజన్న, జూనియర్ అసిస్టెంట్ వసంత్, నాయకులు శ్రీవర్ధన్, తిరుపతి, వసీఖాన్, రాకేష్, దిగంబర్, రాజన్న, సురేష్‌గౌడ్, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపైన పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేందర్ అభ్యంతరాలు సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో రవి, నాయకులు ధనుంజయ్, భీమన్న, వెంకటేష్, సంజీవ్, షాకీర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ కార్యాలయంలో ఆయా పంచాయతీల ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపైన పలు రాజకీయ పార్టీల అఖిల పక్ష నాయకులతో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యంతరాలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో తో పాటు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై రాజకీ పార్టీల నాయకులతో ఎంపీడీఓ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మండలాలకు సంబంఽధించిన తుది ఓటరు జాబితాపై శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కోట ప్రసాద్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలపై ఫిర్యాదులను స్వీకరించినట్టు తెలిపారు. ఆక్షేపణలపై సవరణలు తప్పకుండా చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆయా పార్టీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.