Share News

ఫార్మ్‌ ల్యాండ్‌ పేరిట రియల్‌ దందా....

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:38 PM

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోం ది. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధం గా ప్లాట్ల వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారీతిన గుంటల చొ ప్పున ప్లాట్లు ఏర్పాటు చేస్తూ అధిక ధరలకు అంట గడుతున్నారు.

ఫార్మ్‌ ల్యాండ్‌ పేరిట రియల్‌ దందా....

అనుమతులు లేకున్నా వెంచర్లు ఏర్పాటు

గుంటల చొప్పున వ్యయసాయ భూముల అమ్మకం

నిర్మాణ అనుమతులు రావని తెలిసీ అంటగడుతున్న వైనం

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నూతన అంకానికి తెర

-ఫార్మ్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేయవద్ద నిబంధన తుంగలోకి

మంచిర్యాల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోం ది. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధం గా ప్లాట్ల వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారీతిన గుంటల చొ ప్పున ప్లాట్లు ఏర్పాటు చేస్తూ అధిక ధరలకు అంట గడుతున్నారు. జిల్లాలోని జైపూర్‌, భీమారం, హాజీ పూర్‌, లక్షెట్టిపేట, మందమర్రి మండలాల్లో రియల్‌ వ్యాపారులు ఇటీవల ఈ నూతన అంకానికి తెరలే పారు. ఫార్మ్‌ ల్యాండ్‌ వెంచర్లు కావడంతో నిబంధన లు అనుసరించాల్సిన అవసరం లేదని నమ్మబలుకు తూ ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారు. ఆయా వెంచర్లలో విక్రయాలు చేస్తున్న ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణ అనుమతులు రావని తెలిసి మరీ అంటగడుతుం డటం గమనార్హం.

ఐదు గుంటలకు ఒక ప్లాటు చొప్పున...

ఫార్మ్‌ వెంచర్లలో వ్యాపారులు ఐదు గుంటలకు ఒక ప్లాటు చొప్పున ఏర్పాటు చేసి విక్రయాలు జరు పుతున్నారు. వీటిని ముఖ్యంగా వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ప్లాటుకు రూ.20 లక్షల నుంచి రూ. 40 లక్షల మేర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ ప్లాట్లలో శ్రీ గంధం చెట్లను తామే పెంచుతామని, గరిష్టంగా 15 సంవత్సరాల్లో పంట చేతికి వస్తుందని చెబుతున్నా రు. పంట లాభాల్లో యజమాని, ప్లాటు కొనుగోలు దారులకు సమాన భాగస్వామ్యం ఉంటుందని, అ నంతరం ప్లాట్లను కొనుగోలుదార్లకు హ్యాండోవర్‌ చే స్తామని మభ్యపెడుతున్నారు. వ్యాపారుల మాటల కు ఆకర్షితులవుతున్న కస్టమర్లు లక్షలు వెచ్చిస్తూ పె ద్ద మొత్తంలో ఫార్మ్‌ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.

రైతు భరోసా అమలు...

ఫార్మ్‌ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన అనేక మందికి రైతు భరోసా అమలవుతుండడం కొసమె రుపు. వెంచర్‌ కోసం వినియోగించిన భూము లను సబ్‌ డివిజన్‌ చేయకపోవడం, అవి ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే ఉండడం, ఆ భూముల కు నిర్వాహకులు నాలా కన్వర్షన్‌ కూడా చేయించక పోవడంతో రిజిస్ట్రేషన్లు జరిగినవారి పేరిట రైతు భ రోసా సొమ్ము అక్రమంగా జమ అవుతున్నట్లు తె లుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్లాట్లు కొనుగో లు చేస్తే...ఎప్పుడో 15 ఏళ్ల తరువాత అందజేస్తామని వ్యాపారులు చెబుతుండటంతో గుడ్డిగా వాటివైపు మొగ్గు చూపుతున్నారు. భూముల ధరలు ఆకాశా న్నంటుతున్న నేటి రోజుల్లో.... అన్ని సక్రమంగా ఉం డి, దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు, భూ ములు ఇతర పేరిట అక్రమంగా రికార్డుల్లోకి ఎక్కు తున్నాయి. ఏదో ఒక లిటిగేషన్‌తో ఇతర భూముల ను స్వాధీనం.. చేసుకోవడం షరా మామూలైపోయిం ది. ఈ క్రమంలో 15 ఏళ్ల తరువాత ఫార్మ్‌ ప్లాట్లు చే తికి వస్తాయా...? అన్న సందేహాలు ఉన్నాయి. అ ప్పుడు ఫార్మ్‌ వెంచర్లు ఏర్పాటు చేసిన వారు అం దుబాటులో ఉంటారా...? కొనుగోలుదారు పక్షాన ఎ వరు బాధ్యత తీసుకుంటారన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు..

ఫార్మ్‌ (వ్యవసాయ) ప్లాట్లు కొంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగ నాథ్‌ ఇటీవల స్పష్టం చేశారు. ఆయా ప్లాట్లకు అధి కారికంగా అనుమతులు ఉండవని, వాటిలో చేపట్టే నిర్మాణాలకు పర్మిషన్లు కూడా ఇవ్వరని తెలిపారు. ఆ ప్లాట్లు కొనుగోలు చేస్తే తరువాత ఇబ్బందులు త ప్పవన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూ చించారు. ఇదిలా ఉండగా తెలంగాణ మునిసిపల్‌ యాక్ట్‌-2019, పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకా రం ఫార్మ్‌ ప్లాట్లు అమ్మవద్దని స్పష్టమైన నిబంధ న లు ఉన్నాయి. రెండు వేల చదరపు మీటర్లు లేదా 20 గుంటల స్థలం ఉంటేనే వ్యవసాయ భూమిగా పరిగణించాలంటూ గతంలో ప్రభుత్వం స్పష్టతని చ్చింది. అలాగే ఫార్మ్‌ ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకూ ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని తహ సీల్దార్‌ కార్యాలయాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఫా ర్మ్‌ ప్లాట్లకు యథేశ్చగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండటం గమనార్హం. మరోవైపు జీవో 131 ప్రకారం 2020 ఆ గస్టు 31 తర్వాత అక్రమ లే అవుట్లలోని ప్లాట్లకు అ నుమతులు ఇచ్చేదని లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వం స్ప ష్టం చేసింది. 10 శాతం పార్కులు, 30 శాతం రహ దారుల కోసం స్థలాలు కేటాయించి లే అవుట్‌లు అ భివృద్ధి చేయాలన్న నిబంధనలు పాటించకుండా కొందరు ఫార్మ్‌ ప్లాట్లు, అక్రమ లే అవుట్లు చేసి అ మ్మకాలు జరుపుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

Updated Date - Aug 03 , 2025 | 11:38 PM