Share News

రియల్‌ ఢమాల్‌...

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:14 PM

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా చతికిలబడింది. ఆ రంగంపై ఆధారపడ్డ వ్యాపారులు, మధ్యవర్తుల పరిస్థి తి దయనీయంగా మారింది. వెంచర్లు ఏర్పాటు చేసేం దుకు వ్యాపారులు పెద్ద మొత్తంలో అప్పులు చేసి స్థ లాలు కొనుగోలు చేసినప్పటికీ, సబ్‌ డివిజన్ల రిజిస్ట్రేష న్లు పూర్తిస్థాయిలో జరుగకపోవడంతో ఆశించిన స్థా యిలో విక్రయాలు జరగక దిక్కుతోచని పరిస్థితుల్లో కొ ట్టుమిట్టాడుతున్నారు.

రియల్‌ ఢమాల్‌...

-దయనీయ పరిస్థితుల్లో స్థిరాస్థి వ్యాపారులు

-పూర్తిగా మందగించిన ప్లాట్ల అమ్మకాలు

-చతికిలపడ్డ నాన్‌ లే అవుట్‌ వెంచర్లు

-బిల్డర్ల పరిస్థితీ అంతంత మాత్రమే

-ఇతర రంగాలపైనా ప్రభావం

మంచిర్యాల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా చతికిలబడింది. ఆ రంగంపై ఆధారపడ్డ వ్యాపారులు, మధ్యవర్తుల పరిస్థి తి దయనీయంగా మారింది. వెంచర్లు ఏర్పాటు చేసేం దుకు వ్యాపారులు పెద్ద మొత్తంలో అప్పులు చేసి స్థ లాలు కొనుగోలు చేసినప్పటికీ, సబ్‌ డివిజన్ల రిజిస్ట్రేష న్లు పూర్తిస్థాయిలో జరుగకపోవడంతో ఆశించిన స్థా యిలో విక్రయాలు జరగక దిక్కుతోచని పరిస్థితుల్లో కొ ట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా నాన్‌ లే అవుట్‌ వెం చర్లు ఏర్పాటు చేసిన వ్యాపారుల పరిస్థితి మరింత అ ధ్వానంగా తయారైంది. ఈ ఏడాది రియల్‌ ఎస్టేట్‌ రం గానికి ఏ మాత్రం కలిసి రాకపోవడం, దాని ప్రభావం ఇతర రంగాలపై కూడా పడటంతో జిల్లాలో బిజినెస్‌ అంతా కుదేలైంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం చతికిల ప డటంతో దాని ప్రభావం ఇతర వ్యాపార రంగాల పైనా పడింది.

అసెంబ్లీ ఎన్నికలతో మొదలు....

అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అవస్థలు రెండేళ్లు గడుస్తున్నా నేటికీ గా డిన పడలేదు. అప్పుడు ఎన్నికల కోడ్‌ కారణంగా భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోగా, ఆ తరువాత కూడా పుంజుకోకపోవడంతో డబ్బు చలామణిలేక రి యల్‌ ఎస్టేట్‌ రంగం కునారిల్లుతోంది. వినియోగదా రులు లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెల వెలబో తున్నాయి. తిరిగి పంచాయతీ ఎన్నికల సందర్భం గా నూ ’కోడ్‌’ అమల్లోకి రావడంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. భూముల క్రయ, విక్రయాలకు సం బంధించి రిజిస్ట్రేషన్ల సమయంలో పెద్ద మొత్తంలో డ బ్బులు అవసరం ఉంటుంది. ఎలక్షన్‌ కోడ్‌ కార ణంగా వాటిని తీసుకెళ్లడం కష్టసాధ్యంగా మారింది. దీంతో స్థి రాస్థి వ్యాపారులు భూముల క్రయ, విక్రయాల జోలి కి వెళ్లలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసి పరిస్థితులు అ నుకూలంగా మారినప్పటికీ నాన్‌ లే అవుట్‌ వెంచర్ల కు విధించిన నిబంధనలతో బిజినెస్‌ ఊపందుకోలేదు. ఈ కారణంగా ప్రభుత్వ ఖజానాకు సైతం పెద్ద ఎత్తు న గండి పడుతోంది.

పరిస్థితులు అనుకూలించేనా....?

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో అత్యధికులు ప్రత్యక్షం గానో, పరోక్షంగానో రాజకీయాలతో సంబంధాలు కలిగి ఉన్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అ భ్యర్థులు సైతం ఖర్చుల కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రుల సహాయ, సహకారాలు పొందారు. రూ. లక్షల్లో అ భ్యర్థులకు ఆర్థిక సహాయం చేయాల్సి రావడంతో అ ప్పటిదాకా బిజినెస్‌ కోసం కేటాయించిన సొమ్మును వ్యాపారులు రాజకీయాల కోసం వినియోగించారు. దీంతో నగదు చలామణిపై ఆధారపడి ఉన్న రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ పూర్తిగా మందగించింది. సాధారణం గా ప్రతియేటా నవంబరు నుంచి జూన్‌ మధ్యకాలం లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపుమీద ఉంటుంది. ఈ కాలంలో భూముల క్రయ, విక్రయాలు జోరుగా సాగుతాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఓ వైపు ఎన్నికల సమయం, మరోవైపు కఠి న నిబంధనల కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇదిలా ఉండగా నాన్‌ లే అ వుట్‌ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఈ యేడాది వ్యాపారం మొత్తం చేయిదాటినట్లేననే అ భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు, మూడు ఎ కరాల తక్కువ విస్తీర్ణంలో వెంచర్లు ఏర్పాటు చేసే వ్యాపారులు లే అవుట్‌కు వెళ్లేందుకు పరిస్థితులు అ నుకూలించవు. లే అవుట్‌కు వెళితే 10 శాతం భూమి స్థానిక సంస్థల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉం టుంది. తక్కువ విస్తీర్ణం కావడం, అం దులోని కొంత భూమి గ్రామ పంచాయతీలు, ము న్సిపాలిటీల పేరిట మార్చాల్సి రావడంతో వచ్చే లాభాలు కాస్త ఆ భూమి రూపంలో కోల్పోవలసి వస్తుంది. ఈ కారణంగా వ్యాపారులు లే అవుట్‌ లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేసి, పరిచయం ఉన్న వారితో ప్లాట్లు కొనుగోలు చేయిస్తుంటారు. ప్రస్తు తం నాన్‌ లే అవుట్‌ వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో చిన్న వ్యాపారుల పరిస్థితి దయనీ యంగా మారింది.

ప్రభుత్వం కనికరిస్తేనే....!

తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న నాన్‌ లే అ వుట్‌ వెంచర్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఏదో ఒక రకంగా అనుమతులిచ్చి కరుణిస్తేనే రియల్‌ ఎస్టేట్‌ రంగం తిరిగి పుంజుకునే అవకాశాలు ఉంటాయి. రిజి స్ట్రేషన్లు జరుగక చిన్న వ్యాపారులు చాలా ఇబ్బందు లు పడుతున్నారు. ప్లాట్లు అమ్ముకుంటేనే జీవనం సా గించే పరిస్థితి ఉంది. లేని పక్షంలో రియల్‌ ఎస్టేట్‌ రం గంపై ఆధారపడ్డ వందలాది మంది రోడ్డున పడాల్సి వస్తుంది. నాన్‌ లే అవుట్‌ వెంచర్లలోని ప్లాట్ల క్రమబ ద్దీకరణ కోసం ఇప్పటికే చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్‌ చే యించి ఉన్నారు. 2020 ఆగస్టులో బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో నాన్‌ లే అవుట్‌ వెంచర్ల ప్లా ట్లకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ఇందులో భా గంగా ప్లాట్‌కు రూ. 1000, వెంచర్‌కు రూ. 10 వేల చొ ప్పున ఫీజు కూడా వసూలు చేసింది. దీంతో పెద్ద మొ త్తంలో వ్యాపారులు ఫీజులు చెల్లించారు. అయినా ఆ దిశగా కార్యాచరణ జరుగలేదు. ఇప్పటి కాంగ్రెస్‌ ప్ర భు త్వ మైనా నాన్‌ లేఅవుట్‌ వెంచర్లలోని పాత ప్లా ట్లకు రిజిస్ట్రేషన్‌ జరిగేలా చర్యలు తీసుకోవడం ద్వారా రియ ల్‌ ఎస్టేట్‌ రంగాన్ని గాడిలో పట్టే ఆలోచన చేయాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ ఫార్మ్‌ ల్యాండ్‌ కు సంబంఽధించి కొందరు అధికారులు ప్లాట్ల రిజిస్ట్రేష న్లు చేస్తుండగా, అధికారికంగా అన్ని ప్లాట ్లకు రిజిస్ట్రేషన్లు చేసేలా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్రల్‌ ఇవ్వాల ని వ్యాపారులు కోరుతున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:14 PM